Kabul Blast: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 20 మంది మరణించారు. స్థానిక రష్యన్ ఎంబసీ గేట్ వద్ద సోమవారం ఉదయం ఈ దాడి జరిగింది. ఎంబసీ వద్ద చాలా మంది పౌరులు వీసాల కోసం అక్కడికి చేరుకున్నారు.Kabul Blast
ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న ఒక దుండగుడిని తాలిబన్ పోలీసులు గుర్తించారు. అతడ్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తన దగ్గరున్న బాంబుల్ని విసిరేశాడు. అవి ఎంబసీ గేటు వద్ద పడి పేలాయి. ఈ ఘటనలో దాదాపు 20 మంది మరణించినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ దాడిలో ఆఫ్ఘన్ పౌరులతోపాటు రష్యాకు చెందిన ఇద్దరు దౌత్యాధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఆత్మాహుతికి యత్నించి దాడికి పాల్పడ్డ దుండుగుడిని అధికారులు కాల్చి చంపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tamil Nadu: పొదల్లో శిశువు మృతదేహం.. స్కూల్లోనే ప్రసవించి, వదిలేసిన బాలిక
గత ఏడాది ఆఫ్ఘన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత అనేక దేశాలకు చెందిన దౌత్యకార్యాలయాల్ని ఆయా దేశాలు మూసేశాయి. ప్రస్తుతం అక్కడ ఎంబసీ నిర్వహిస్తున్న కొన్ని దేశాల్లో రష్యా కూడా ఉంది. ఇక, ఇటీవలి కాలంలో ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన రెండో బాంబు దాడి ఇది. గత శుక్రవారం కూడా ఒక మసీదు వద్ద ప్రార్థనలు జరుపుతుండగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో కూడా 20 మంది చనిపోయారు.