Triple Murder Case : ముగ్గురు దళితుల హత్య కేసులో 27 మందికి జీవిత ఖైదు

ముగ్గురు దళితుల హత్య కేసులో 27 మందికి జీవిత ఖైదు విధించింది తమిళనాడులోని కోర్టు.

Triple Murder Case : ముగ్గురు దళితుల హత్య కేసులో 27 మందికి జీవిత ఖైదు విధించింది తమిళనాడులోని కోర్టు. రాష్ట్రంలోని శివగంగై జిల్లాలోని కచనథం గ్రామంలోని ఎస్సీ కులానికి చెందిన అర్ముగం(65), షణ్ముగ‌నాథ‌న్‌(31), చంద్ర‌శేఖ‌ర్‌(34) అనే వారు 2018 వ సంవత్సరం మే 28 వ తేదీ అర్ధరాత్రి తిరుప్ప‌చెట్టి స‌మీపంలో అత్యంత దారుణంగా హత్య చేయబడ్డారు. ఈ ఘటనలో మరో ఐదుగురు దళితులకు తీవ్ర గాయాలయ్యాయి.

ఓ దేవాలయానికి చెందిన ఉత్సవంలో అగ్ర‌కులాల వ్య‌క్తుల‌కు గౌర‌వం ఇవ్వ‌లేద‌నే కారణంతో ఆ ముగ్గురిని చంపిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. పోలీసులు 33 మందిపై చార్జీషీటు దాఖ‌లు చేశారు. అయితే ఇందులో న‌లుగురు మైన‌ర్లు ఉన్నారు. మైన‌ర్ల‌లో ఇద్ద‌రూ విచార‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే చ‌నిపోయారు. ఒక‌రు త‌ప్పించుకొని పోయారు. నాలుగేళ్ల పాటు విచారణ చేసిన స్పెషల్ కోర్టు 27 మందికి జీవిత ఖైదు విధిస్తున్నట్లు శుక్రవారం తీర్పు చెప్పింది.

Also Read : Advocate Murder Case : ములుగు జిల్లాలో లాయర్ హత్య కేసులో కొత్త ట్విస్ట్

ట్రెండింగ్ వార్తలు