Advocate Murder Case : ములుగు జిల్లాలో లాయర్ హత్య కేసులో కొత్త ట్విస్ట్

ములుగు జిల్లాల్లో అత్యంత దారుణంగా హత్యకు గురైన  న్యాయవాది మల్లారెడ్డి  మర్డర్  కేసులో.. కీలక విషయాలు బయటకొస్తున్నాయి.

Advocate Murder Case : ములుగు జిల్లాలో లాయర్ హత్య కేసులో కొత్త ట్విస్ట్

Advocate Murder Case :  ములుగు జిల్లాల్లో అత్యంత దారుణంగా హత్యకు గురైన  న్యాయవాది మల్లారెడ్డి  మర్డర్  కేసులో.. కీలక విషయాలు బయటకొస్తున్నాయి. ఆయన హత్య వెనుక.. మైనింగ్ మాఫియా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో.. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ పోలీసులు విచారించారు. త్వరలోనే.. ఈ మర్డర్ వెనుక ఉన్న మిస్టరీ వీడనుంది.

మలుగు జిల్లాలో జరిగిన లాయర్ మర్డర్ కేసు.. తెలంగాణలో సంచలనంగా మారింది. ఆయన్ని.. ఎవరు చంపారు? ఎందుకోసం చంపారన్న దానిపై సస్పెన్స్ కొనసాగింది. అయితే.. ఈ హత్య కేసుకు సంబంధించిన కీలక విషయాలు బయటకొస్తున్నాయి. పోలీసులు అనుమానించినట్లుగా కాకుండా.. కొత్త ట్విస్ట్‌లు బయటపడ్డాయి. అడ్వకేట్‌ మల్లారెడ్డి హత్య వెనుక.. మైనింగ్‌ మాఫియా ప్రాధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. క్వారీ యజమానులంతా కలిసి కట్టుగా కుట్రపన్ని మరీ మల్లారెడ్డిని మర్డర్ చేయించినట్లు సమాచారం.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు, రామచంద్రాపురానికి చెందిన మైనింగ్‌ వ్యాపారి ఇందులో చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. మల్లారెడ్డిని హతమార్చేందుకు.. ఏడాది కిందటే స్కెచ్ గీసినట్లు తెలుస్తోంది. నర్సంపేటకు చెందిన ఓ వ్యాపారితో పాటు కొందరు అధికార, ప్రతిపక్ష నేతలకు.. ఈ హత్యతో ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది.  ఇక.. అడ్వకేట్ మర్డర్ కోసం.. ఓ రిపోర్టర్ నిధులు సేకరించి.. ఏపీకి చెందిన హంతక ముఠాకు 15 లక్షల సుపారీ ఇచ్చారు.

మొత్తం.. 44 క్వారీలకు చెందిన వ్యాపారుల నుంచి 20 లక్షలకు పైగా డబ్బులు వసూలు చేశారు. ఈ హత్య కోసం ఓ పాత నేరస్తుడు.. ఈవెంట్ మేనేజర్‌గా వ్యవహరించినట్లు తెలుస్తోంది. మొత్తం.. 8 మందిని.. 3 బృందాలుగా ఏర్పాటు చేసి.. అనుకున్న విధంగా.. పందికుంట దగ్గర న్యాయవాది మల్లారెడ్డిని దారుణంగా హతమార్చారు. తర్వాత.. ములుగు మండలంలోని తండాల మీదుగా.. దుండగులు నల్లబెల్లి మండలం ముచ్చింపుల అనే గ్రామానికి చేరుకొని.. ఆ ఊరికి దూరంగా ఉన్న ఓ ప్రదేశంలో పార్టీ చేసుకున్నట్లు విచారణలో తేలింది.

అంతేకాదు.. హత్యలో పాల్గొని.. చేతికి గాయం చేసుకున్న ఓ దుండగుడికి.. విలేకరే వైద్యం చేశాడనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మధ్య రాత్రి దాటాక.. ఎక్కడి వారక్కడికి వెళ్లిపోయారు. ఈ మర్డర్‌కు సంబంధించి.. మొత్తం 60 లక్షలకు డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. మల్లారెడ్డి హత్య కేసులో పోలీసులు మొత్తం 24 మందిని విచారించారు. త్వరలోనే.. దీనిపై మిస్టరీ వీడనుంది. ఇక.. లక్నపల్లి శివారులో ఓ అనుమానాస్పద కారు లభ్యమైంది. ఈ కారునే.. నిందితులు ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు.

Also Read : BJP Leader Threatens Woman : మహిళపై చేయిచేసుకున్న బీజేపీ నాయకుడు