Apple iPhone 16 : ఆపిల్ ఐఫోన్ 17కు ముందే ఐఫోన్ 16 ధర తగ్గిందోచ్.. ఇది కదా డిస్కౌంట్ అంటే.. డోంట్ మిస్!

Apple iPhone 16 : అతి త్వరలో ఐఫోన్ 17 సిరీస్ రాబోతుంది. అంతకన్నా ముందుగానే ఐఫోన్ 16 ధర అమాంతం తగ్గిపోయింది. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలంటే?

Apple iPhone 16 : ఆపిల్ ఐఫోన్ 17కు ముందే ఐఫోన్ 16 ధర తగ్గిందోచ్.. ఇది కదా డిస్కౌంట్ అంటే.. డోంట్ మిస్!

Apple iPhone 16

Updated On : September 5, 2025 / 5:27 PM IST

Apple iPhone 16 : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఐఫోన్ 17 లాంచ్ కు ముందుగానే ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ ధర భారీగా తగ్గింది. షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 9న ఆపిల్ (Awe-dropping) ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది.

రాబోయే ఐఫోన్ లైనప్ చుట్టూ ఎక్కువగా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే పాత ఐఫోన్ మోడళ్లు భారీగా ధర తగ్గింపు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేటెస్ట్ ఐఫోన్ మోడల్ కోసం చూస్తున్నవారికి ఇదో అద్భుతమైన అవకాశం. విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో ఈ డీల్ అందుబాటులో ఉంది. ఐఫోన్ 16 కేవలం రూ. 11,500 భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ డీల్స్ ఎలా పొందాలంటే?

Apple iPhone 16 : ఐఫోన్ 16 డీల్ :

భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 రూ.79,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ప్రస్తుతం రూ.71,900కి లిస్ట్ అయింది. రిటైలర్ ఐఫోన్ 16పై రూ.8వేలు ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.3,500 తగ్గింపును పొందవచ్చు.

Read Also : Flipkart Amazon Sales : గెట్ రెడీ.. ఈ తేదీ నుంచే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్.. ఈ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు..!

ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16 డివైజ్ 6.1-అంగుళాల OLED డిస్‌ప్లే, 60hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ కలిగి ఉంది. డిస్ ప్లే HDR, ట్రూ టోన్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. సిరామిక్ షీల్డ్ గ్లాస్ కోటింగ్‌ను కలిగి ఉంటుంది. ఈ ఐఫోన్ పవర్ అందించేందుకు A18 బయోనిక్ చిప్‌సెట్ కలిగి ఉంది. ఈ ఫోన్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు సపోర్టు ఇస్తుంది.

ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ 22 గంటల వరకు ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తుంది. IP68 సర్టిఫైడ్ కలిగి ఉంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఆపిల్ ఐఫోన్ 16 డివైజ్ 2x ఆప్టికల్ జూమ్‌తో 48MP ఫ్యూజన్ సెన్సార్, 12MP మాక్రో లెన్స్‌ కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ఫ్రంట్ సైడ్ 12MP కెమెరాను కలిగి ఉంది.

అమెజాన్‌లో ఐఫోన్ 16 ప్రో డీల్ :
భారత మార్కెట్లో ఐఫోన్ 16 ప్రో మొదట రూ.1,19,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం, అమెజాన్‌లో కేవలం రూ.1,07,900కి లిస్ట్ అయింది. రూ.12వేలు ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. అంతే కాదు, మీరు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.3,237 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

తద్వారా ధర రూ.1,04,663కి తగ్గుతుంది. ఫలితంగా మొత్తం రూ.15,237 సేవ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ సేవింగ్ చేసుకోవాలనుకునే వారికి, అమెజాన్ ఎక్స్ఛేంజ్ డీల్స్‌ను కూడా అందిస్తుంది. మీరు మోడల్, డివైజ్ వర్కింగ్ కండిషన్ బట్టి మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను అదనపు డిస్కౌంటుతో ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.