Shocking Video : విడాకులు తీసుకున్న భార్యను తాళ్లతో కట్టేసి..నాలుగో అంతస్తు నుంచి తోసేసి…….
సంసారంలో గొడవలు ఏవో ఒకటి వస్తుంటాయి వాటిని అందరూ సర్దుకుపోతుంటారు. సర్దుకు పోలేని వారు రోజూ గొడవలు పడుతూ ఉంటారు.

Shocking Video
Shocking Video : సంసారంలో గొడవలు ఏవో ఒకటి వస్తుంటాయి వాటిని అందరూ సర్దుకుపోతుంటారు. సర్దుకు పోలేని వారు రోజూ గొడవలు పడుతూ ఉంటారు. అలా గొడవ పడని వారు విడాకులు తీసుకుని ఎవరి జీవితం వారు హ్యాపీగా గడుపుతూ ఉంటారు. కానీ ఆగ్రాలోని ఒక వ్యక్తి భార్యకు విడాకులు ఇచ్చి ఇద్దరూ విడిపోయిన తర్వాత ఆమెపై కక్ష పెంచుకుని హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఆగ్రా లోని నాగ్లామేవతి లోని అపార్ట్ మెంట్ లో ఘజియాబాద్‌కు చెందిన రితికా సింగ్ అనే వివాహిత నివసిస్తోంది. ఇటీవల ఆమె హత్యకు గురైంది. 2014 లో ఆమె ఫిరోజాబాద్ కు చెందిన ఆకాశ్ గౌతమ్ ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత కుటుంబంలో ఏర్పడిన కలతల కారణంగా 2018లో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి వారిద్దరూ ఎవరి జీవితం వారు జీవిస్తున్నారు.
భర్తతో విడాకుల అనంతరం రితికాసింగ్ తన ఫేస్ బుక్ స్నేహితుడు విపుల్ అగర్వాల్ తో నాగ్లామేవతి అపార్ట్ మెంట్ లో కలిసి ఉంటోంది. ఇలా ఉండగా శుక్రవారం, జూన్ 24వ తేదీన, ఉదయం 11 గంటల సమయంలో ఆమె మాజీ భర్త ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలతో కలిసి రితికా సింగ్ ఉండే అపార్ట్ మెంట్ కు వచ్చి ఆమెపై దాడి చేసేందుకు యత్నించారు. వారు రితికా ప్రియుడిపై దాడి చేసారు. అతడిని బాత్ రూం లో పెట్టి గడియ పెట్టారు. అనంతరం రితికా కాళ్లు చేతులు కట్టేసి అపార్ట్ మెంట్ నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసి చంపేశారు. విపుల్ బాత్ రూం నుంచి అరవటంతో ఇరుగుపొరుగు వారు వచ్చ అతడిని రక్షించారు. రితికా కోసం వెతకగా ఆమె కింద శవమై తేలింది.
Also Read : Symptoms Of Insomnia : నిద్రలేమికి కారణాలు, లక్షణాలు!
ఈ మేరకు రితికా స్నేహితుడు విపుల్ అగర్వాల్ ఆగ్రాలోని తాజ్ గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 302, 34 కింద కేసు నమోదు చేసారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురుని అరెస్ట్ చేశామని మరోక ఇద్దరిని అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కాగా… రితికా సింగ్ ను అపార్ట్ మెంట్ నుంచి కిందకు పడేసిన సీసీ టీవీ పుటేజి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#cctv footage of the incident. pic.twitter.com/fXet0nO5fC
— Anuja Jaiswal (@AnujaJaiswalTOI) June 24, 2022