హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. సింగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చిన సురేష్ అనే ప్రయాణికుని నుంచి మూడు కిలోల 300 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. విమానం దిగిన ప్రయాణికుడు బయటకు వెళ్లే క్రమంలో అనుమానాస్పదంగా వ్యవహరించటంతో అధికారులు అతడ్ని సోదాలు చేశారు. shoe లో దాచి పెట్టిన బంగారాన్ని గుర్తించారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.