Delhi House Collapse : ఢిల్లీలో కూలిన భవనం.. శిథిలాల కింద చిన్నారి సహా ఐదుగురు..
ఉత్తర ఢిల్లీలోని బవానా ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో భవనం కింద చిన్నారులు సహా ఐదుగురు చిక్కినట్టు పోలీసులు వెల్లడించారు.

5, Including Children, Buri
Delhi House Collapse : ఉత్తర ఢిల్లీలోని బవానా ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో భవనం కింద చిన్నారులు సహా ఐదుగురు చిక్కినట్టు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే శిథిలాల కింద నుంచి ఇద్దరు మహిళలను బయటకు వెలికితీశారు. చిక్కుకుపోయిన మరికొందరిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
జల్ మండలి భవనం సమీపంలో రాజీవ్ రతన్ ఆవాస్‌కు చెందినదిగా గుర్తించారు. ఫిబ్రవరి 11న మధ్యాహ్నం 2.48 గంటల సమయంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. కూలిన భవనంలో దాదాపు 300 నుంచి 400 వరకు ప్లాట్లు ఉన్నాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా మూడు జేసీబీలు, హైడ్రా మిషన్, రెండు అంబులెన్స్ లు ఘటనా స్థలికి చేరుకున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. అధికారులు వివరాల ప్రకారం.. శిథిలాల నుంచి ఇద్దరు మహిళలను రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
కూలిన ఇంటి శిథిలాల కింద తొమ్మిదేళ్ల బాలికతో సహా కనీసం ముగ్గురు వ్యక్తులు ఉన్నారని అధికారులు తెలిపారు. శిథిలాల కింద మరో ఇద్దరు లేదా ముగ్గురు ఉండవచ్చని భావిస్తున్నారు. రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది జేసీబీ సాయంతో శిథిలాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
Read Also : CM KCR : ‘మీ బెదిరింపులకు భయపడం’.. మోదీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ ఫైర్