పారిస్‌లో భారీ అగ్నిప్రమాదం: ఏడుగురు సజీవదహనం

పారిస్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని  ఫ్రెంచ్ క్యాపిటల్ ట్రెండీ 16వ అరెండోస్ మెంట్ రెసిడెన్షియల్ బిల్డింగ్ లో సోమవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

  • Publish Date - February 5, 2019 / 07:41 AM IST

పారిస్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని  ఫ్రెంచ్ క్యాపిటల్ ట్రెండీ 16వ అరెండోస్ మెంట్ రెసిడెన్షియల్ బిల్డింగ్ లో సోమవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

పారిస్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని  ఫ్రెంచ్ క్యాపిటల్ ట్రెండీ 16వ అరెండోస్ మెంట్ రెసిడెన్షియల్ బిల్డింగ్ లో సోమవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవదహనం కాగా, పలువురికి గాయాలు అయ్యాయి. 8 అంతస్థుల భవనంలోని 7వ, 8వ అంతస్థులో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించినట్టు ఫైర్ సిబ్బంది తెలిపారు. మంటలను అదుపు చేసే క్రమంలో భవనం నుంచి 27 మందిని ఖాళీ చేయించిన అగ్నిమాపక సిబ్బందిలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. భవనంలోని మంటలు పక్కనే ఉన్న ఇతర భవనాల్లోకి కూడా వ్యాపించాయని, ముందు జాగ్రత్త చర్యగా ఆ భవనంలోని వారిని వెంటనే ఖాళీ చేయించినట్టు తెలిపారు. 
 

పారిస్ పర్యాటక ప్రాంతమైన ఈఫిల్ టవర్, పారిస్ సెయింట్ జర్మన్ హోం స్టేడియం, విదేశీ ఎంబాసీలు, మ్యూజియంలకు సమీపంలో అగ్నిప్రమాదం సంభవించడంతో భయాందోళన వాతావరణం నెలకొంది. దీంతో సమీప ప్రాంతాల్లోని ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. దట్టమైన పొగ, మంటలు వ్యాపిస్తుండటంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులో తేవడానికి 5 గంటల పాటు శ్రమించారు. ఇప్పటికే ఘటనా స్థలానికి 200 మంది అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. గతనెలలో పారిస్ సిటీ 9వ అరెండోస్ మెంట్ భవనంలో గ్యాస్ పేలడంతో నలుగురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.