Minor Girl Kidnaped And Safe
Minor Girl Kidnapped : సంగారెడ్డి జిల్లాలో 7 సంవత్సరాల మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. సంగారెడ్డికి చెందిన బాలికను ఇద్దరు యువకులు శనివారం కిడ్నాప్ చేసి జోగిపేట వైపు బైక్ పై తీసుకువచ్చారు. కల్లు తాగేందుకు శివ్వంపేటలోని కల్లు దుకాణం వద్ద ఆగారు. కల్లు దుకాణంలోకి బాలికను వెంట తీసుకెళ్లారు. వారు కల్లు తాగుతుండగా అక్కడ బాలిక ఏడుస్తుండడంతో అనుమానం వచ్చిన గ్రామస్థులు ఆగంతకులను నిలదీశారు.
Also Read : Pournami Girivalam : సెప్టెంబర్ పౌర్ణమికి అరుణాచలంలో గిరిప్రదక్షిణకు అనుమతి లేదు
ఆగంతకులు సరైన సమాధానం చెప్పలేకపోయారు. వినాయక విగ్రహాలను చూపిస్తామంటూ బాలికను నమ్మించి ఇద్దరు దుండగులు తీసుకువచ్చినట్లు బాలిక తెలపటంతో స్ధానికులు ఇద్దరు ఆగంతకులను పట్టుకుని పుల్కల్ పోలీసులకు అప్పగించారు. బాలికను రక్షించి 108 వాహనంలో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుల్లో ఒకరు కంది, మరొకరు సదాశివపేట కు చెందిన వారిగా పోలీసులుగుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.