పహాడీషరీఫ్‌లో ఏడేళ్ల బాలుడి దారుణ హత్య

  • Publish Date - May 9, 2019 / 01:00 AM IST

హైదరాబాద్‌లో నేరాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడో ఒకచోట దారుణ హత్యల ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అభం..శుభం తెలియని చిన్నారులను సైతం దారుణంగా చంపేస్తున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మే 08వ తేదీ బుధవారం దారుణం  జరిగింది. పహాడీషరీఫ్‌ పీఎస్‌ పరిధిలో ఓ మైనర్ బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా చంపేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలుడిని ఎవరు చంపారనేది తెలియరావడం లేదు. నిర్మానుష్య ప్రదేశంలో బాలుడిని హత్య చేశారు. గంజాయి…మత్తు పదార్థాలు సేవిస్తుంటారని స్థానికులు వెల్లడిస్తున్నారు. స్థానికంగా తిరిగే గంజాయి గ్యాంగే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కొడుకు విగతజీవిగా పడి ఉండడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అత్యాచారం చేసి హత్య చేశారని వారు ఆరోపిస్తున్నారు.