అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదల్‌గురి జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 8 మంది అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారి 15పై ఓరాంగ్ గెలబిల్ ఏరియా వద్ద కారు – ట్రక్కు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 8 మంది అక్కడికక్కడే కన్నుమూశారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారంతా ఓ పెళ్లి వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఆరుగురిని దిగంత సైకియా, పార్థా కురి, నారాయణ్ దాస్, రింకు సైకియా, రంజిత్ దేకా, పరిమ కురిగా గుర్తించారు.
ఈ ప్రమాదం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో 8 మంది మరణించిన ఘటనపై అసోం సీఎం సర్బానంద సోనోవాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Assam: 8 persons dead in a road accident on National Highway-15 in Orang area of Udalguri district. pic.twitter.com/96AT2voeyS
— ANI (@ANI) November 20, 2019