Devotee Cut Off Tongue Offered Goddess : ఉత్తరప్రదేశ్ ఆలయంలో కలకలం.. నాలుక కోసుకుని దేవతకు సమర్పించిన భక్తుడు
ఓ భక్తుడు ఏకంగా తన నాలుక కోసుకుని దేవతకు సమర్పించాడు. దీంతో ఆ ఆలయంలో కలకలం రేగింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో చోటు చేసుకుంది.
- bheemraj
- Published On : September 10, 2022 / 10:21 PM IST
Devotee Cut Off Tongue Offered Goddess
Devotee Cut Off Tongue Offered Goddess : సాధారణంగా భక్తులు వివిధ రకాలుగా దేవుళ్లకు మొక్కులు చెల్లిస్తుంటారు. కొన్ని దేవుళ్లలకు కొంతమంది తలనీలాలు ఇస్తారు. మరికొంత మంది డబ్బులు, బంగారు ఆభరణాలు చేయిస్తారు. కానీ ఓ భక్తుడు ఏకంగా తన నాలుక కోసుకుని దేవతకు సమర్పించాడు. దీంతో ఆ ఆలయంలో కలకలం రేగింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో చోటు చేసుకుంది.
కౌశాంబికి చెందిన 38 ఏళ్ల సంపత్, భార్య బన్నో దేవితో కలిసి శనివారం(సెప్టెంబర్10,2022) ఆ జిల్లాలోని మా షీట్ల ఆలయాన్ని సందర్శించారు. అక్కడి గంగానదిలో పవిత్ర స్నానం చేశారు. ఆపై ఆలయంలో పొర్లుదండాల ప్రదక్షిణలు చేశారు. అనంతరం వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో తన నాలుక కోసుకున్నాడు. ఆలయం ప్రధాన ద్వారం వద్ద తెగిన నాలుకను ఉంచి దేవతకు సమర్పించాడు.
Holika Dahan video : హోలికా దహన్‌లో ప్రహ్లాద్ భక్తుడి ‘అగ్ని స్నానం’..!!
తీవ్ర రక్తస్రావం కావడంతో భక్తుడు సంపత్‌ను చికిత్సం కోసం వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నారు. అయితే సంపత్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు ఆలయాన్ని సందర్శించాలని శుక్రవారం రాత్రే భర్త తనతో అన్నారని భార్య బన్నో దేవి చెప్పారు.
దీంతో శనివారం ఆలయాన్ని సందర్శించామని ఆమె తెలిపారు. అయితే ఇలా నాలుక కోసుకోవడాన్ని తాను ఊహించలేదని ఆమె వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
