Holika Dahan video : హోలికా దహన్‌‌లో ప్రహ్లాద్ భక్తుడి ‘అగ్ని స్నానం’..!!

హోలికా దహన్ వేడుకలో ఓ భక్తుడు ‘అగ్నిలో స్నానం’ చేశాడు. భగభగా మండే మంటల్లో దూకి సురక్షితంగా బయటకు వచ్చిన వీడియో వైరల్ గా మారింది.

Holika Dahan video : హోలికా దహన్‌‌లో ప్రహ్లాద్ భక్తుడి ‘అగ్ని స్నానం’..!!

Mathura Holika Dahan In Up

Mathura Holika Dahan in UP : భక్తి అనే రెండు అక్షరాలు..ఓ భక్తుడిని అగ్నిలో స్నానం చేయించేలా చేసింది. భగభగా మండే మంటల్లో దూకి సురక్షితంగా బయటకు వచ్చేలా చేసింది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా చేసుకునే హోలి పండుగ వేడుకలో జరిగిందీ ఒళ్లు గగుర్పొడిచే ఘటన. హోలికా దహన్ వేడుకలలో భగభగా ఎర్రని మండలు ఎగసి పడే నిప్పుల గుండంలోకి దూసుకెళ్లి అంతే సురక్షితంగా బయటకు వచ్చాడు ఓ భక్తుడు. రాక్షసరాజు హిరణ్య కస్యపుడి కుమారుడు..విష్ణు భక్తుడు అయిన ప్రహ్లాదుడికి పరమ భక్తుడు ఈ మంటల్లో స్నానం చేసిన వ్యక్తి..అతని పేరు ‘మోను పాండా’.. హోలికా దహన్ లో దూకి ‘అగ్ని స్నానం’చేశాడు మోను పాండా అనే ప్రహ్లాద భక్తుడు..దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read : Sri Rama Navami : భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు ప్రారంభం.. ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం

యూపీలోని మథుర ప్రాంతంలోని ఫాలెన్ గ్రామంలో హోలీకా దహన్‌ (Holi 2022) కార్యక్రమం నిర్వహించారు ప్రజలు. గ్రామస్తులంతా హోలికా దహన్ చూసేందుకు గూమికూడిన సమయంలో, ఓ వ్యక్తి ఆ హోలీ దహన్ (మంటలు ఎగసి పడే నిప్పుల గుండం)లోకి దూసుకెళ్లాడు మోను పాండా (monu panda) అనే వ్యక్తి. సడెన్‌గా వచ్చిన మోను హోలీకా దహన్‌ కోసం వేసిన మంటల్లో దూకాడు. కొద్దిసేపటి తర్వాత సురక్షితంగా బయటకు వచ్చారు. ఆ మంటల్లో అతను ఎందుకు దూకాడనే విషయం అర్ధం కాక, అక్కడున్నవాళ్లంతా షాక్‌కు గురయ్యారు.

Also read :  Tirumala Temple: ఏప్రిల్ 1 నుంచి శ్రీవారి ఆర్జిత సేవలు పునఃప్రారంభం: ఆన్‌లైన్‌లో టికెట్లు

మోను పాండా ప్రహ్లాదుడి పరమభక్తుడు. నెల రోజులుగా ప్రహ్లాదుని ఆలయంలో తపస్సు చేస్తున్నారు పాండా. హోలికా దహన్ సందర్భంగా, ప్రహ్లాద్ కుండ్‌లో పవిత్ర స్నానం చేశారు. తరువాత ప్రహ్లాదుని గుడిలో పూజలు చేశారు. ఆ తర్వాత హోలిక అగ్నిలోకి దూకారు. మంటల్లోంచి క్షేమంగా బయటపడిన మోనుపాండాను చూసిన గ్రామస్తులంతా జయజయద్వనాలు చేసి అభినందించారు. ‘భక్తప్రహ్లాద్ కు జై’ అంటూ నినాదాలు చేశారు.

Also read : Yadadri : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి స్వయంభువుల దర్శనం

ప్రతి సంవత్సరం హోలీ పండుగ ముందు రోజు, మథుర ప్రాంతం ఛత్ర తహసీల్‌లోని ఫాలెన్ గ్రామంలో హోలి దహన్ వేడుకలు జరుగుతాయి. హోలీ కా దహన్ కార్యక్రమాన్ని చూడటానికి భక్తులు వేలాదిగా తరలివస్తాయి. ఈ వేడును ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు.కానీ ఏ సంవత్సరం కూడా ఇలా ఎవ్వరు మంట్లో దూకిన దాఖాలు లేవు. కానీ ఈ సంవత్సరం మాత్రం హోలి దహన్ చూడటానికి వచ్చిన భక్తులకు ప్రహ్లాదుడి భక్తు మోను పాండా చేసిన ‘అగ్ని స్నానం’మరింత ఆసక్తినికి కలిగించింది.