Fire Broke Out : శాలిమార్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. తప్పిన పెనుముప్పు

శాలిమార్‌ ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అగ్నిప్రమాదం జరిగింది. రైలు ఇంజిన్‌ వెనుక ఉండే లగేజ్‌ కంపార్టుమెంట్‌లో ఇవాళ ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లోకోపైలట్‌ గమనించి రైలును నిలిపేసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.

fire broke out

Fire Broke Out : శాలిమార్‌ ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అగ్నిప్రమాదం జరిగింది. రైలు ఇంజిన్‌ వెనుక ఉండే లగేజ్‌ కంపార్టుమెంట్‌లో ఇవాళ ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లోకోపైలట్‌ గమనించి రైలును నిలిపేసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సెంట్రల్‌ రైల్వే అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఇంజిన్‌, ప్రయాణికుల బోగీలను ప్రమాదానికి గురైన లగేజ్‌ కంపార్టుమెంట్ నుంచి వేరు చేశారు.

అనంతరం లగేజ్‌ కంపార్టుమెంట్‌ను పక్కన వదిలేసి ప్రయాణికుల బోగీలతో రైలును అక్కడి నుంచి పంపించారు. మహారాష్ట్రలోని నాసిక్‌ ఏరియాలో ఇవాళ ఉదయం 8.43 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, లగేజ్‌ కంపార్టుమెంటులో చెలరేగిన మంటలతో ప్రయాణికుల బోగీలకు ఎలాంటి అపాయం వాటిల్లలేదని అధికారులు పేర్కొన్నారు.

AP Express Train : ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు.. భయంతో ప్రయాణికుల పరుగులు

అయితే ప్రమాదానికి గల కారణం ఏమై ఉంటుందన్న వివరాలు తెలియరాలేదని ముంబైలోని సెంట్రల్‌ రైల్వేకు చెందిన చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ అధికారి వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుందన్నారు.