జేసీ దివాకర్‌రెడ్డి మాజీ పీఏ ఇంటిపై ఏసీబీ దాడులు

టీడీపీ నేత జేసీ దివాకర్‌ రెడ్డి మాజీ పీఏ సురేశ్‌రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై సోదాలు చేపట్టిన ఏసీబీ.. 4 కోట్ల ఆస్తులు గుర్తించింది.

  • Publish Date - November 15, 2019 / 06:21 AM IST

టీడీపీ నేత జేసీ దివాకర్‌ రెడ్డి మాజీ పీఏ సురేశ్‌రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై సోదాలు చేపట్టిన ఏసీబీ.. 4 కోట్ల ఆస్తులు గుర్తించింది.

టీడీపీ నేత జేసీ దివాకర్‌ రెడ్డి మాజీ పీఏ సురేశ్‌రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై సోదాలు చేపట్టిన ఏసీబీ.. 4 కోట్ల ఆస్తులు గుర్తించింది. ఒకప్పుడు జేసీ పీఏగా చేసిన సురేశ్‌.. ప్రస్తుతం పంచాయతీరాజ్‌ శాఖలో ఏఈఈగా పనిచేస్తున్నారు. సురేశ్‌రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లపై సోదాలు జరుగుతున్నాయి. అనంతపురం, పుట్టపర్తి, బేతంచర్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.  

పంచాయతీరాజ్‌ శాఖలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సురేష్‌రెడ్డిని 2014 ఎన్నికల్లో గెలిచిన తరువాత జేసీ దివాకర్‌రెడ్డి తన పీఏగా అపాయింట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. దివాకర్‌రెడ్డిని అ‍డ్డంపెట్టుకుని అక్రమాస్తులు కూడబెట్టుకున్నాడంటూ, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని సురేష్‌పై ఫిర్యాదులు అందాయి. దాంతో ఏసీబీ డీఎస్పీ నాగభూషణం నేతృత్వంలో అధికారులు రంగంలోకి దిగారు. సురేష్‌ ఇంట్లో తనిఖీలు చేయడంతో రూ.4 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.

సురేష్‌ ఇంట్లో ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అనంతపురంలో త్రిబుల్ ఫోర్ బిల్డింగ్, పుట్టపర్తిలో ఒక ఎకర పొలం, బేతంచెర్లలోని అత్తగారి ఇంట్లో మూడు బిల్డింగ్స్, అలాగే పుట్టపర్తి దగ్గర ఒక లేఅవుట్ వేశారు..వాటిలో కొన్ని లేఅవుట్లు అమ్మారు..మరికొన్ని ఉన్నాయని గుర్తించారు. ఇంట్లో ఐదు లక్షల రూపాయల నగదు, 300 గ్రాముల బంగారం గుర్తించినట్లు డీఎస్ పీ తెలిపారు.

సురేష్ పార్టనర్ విజయ భాస్కర్ రెడ్డి ఇంటితోపాటు మొత్తం నాలుగు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు రూ.4 కోట్ల విలువైన అక్రమాస్తులు బయటపడ్డాయని డీఎస్ పీ తెలిపారు. తనిఖీలు పూర్తయిన తర్వాత సురేష్ ను ఏసీబీ కోర్టులో హాజరుపర్చన్నారు ఏసీబీ అధికారులు.