Acb Caught MEO (Photo Credit : Google)
Acb Caught MEO : కొందరు ప్రభుత్వ ఉద్యోగుల తీరు మారడం లేదు. మంచి ఉద్యోగం అంతకుమించి జీతం అందుతున్నా.. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అడ్డదారి తొక్కుతున్నారు. లంచాల కోసం దిగజారిపోతున్నారు. చెయ్యి తడపనిదే పని చేయడం లేదు. పని ఏదైనా లంచం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే, ఏదో రోజు వారి పాపం పండి అడ్డంగా దొరికిపోతున్నారు. ఊచలు లెక్క పెట్టే పరిస్థితిని తెచ్చుకుంటున్నారు.
తాజాగా అనంతపురంలో లంచాధికారి పట్టుబడ్డాడు. కూడేరు మండల విద్యాధికారి చంద్రశేఖర్.. రూ.2లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఓ కార్పొరేట్ పాఠశాల షర్మిషన్ కోసం స్కూల్ యాజమాన్యం నుంచి 2 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశాడు M.E.O. చంద్రశేఖర్. లంచం ఇవ్వడం ఇష్టం లేని కార్పొరేట్ పాఠశాల యాజమాన్యం.. ఏసీబీ అధికారులను ఆశ్రయించింది.
అనంతపురం నగరంలోని బళ్లారి బైపాస్ రోడ్డులో పాఠశాల యాజమాని నుంచి 2 లక్షలు లంచం తీసుకుంటూ ఉండగా ఎంఈవో చంద్రశేఖర్ ని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. కూడేరు మండల కేంద్రంలోని MEO కార్యాలయంలో MEO చంద్రశేఖర్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.
Also Read : బీకేర్ ఫుల్.. కొరియర్ పేరుతో ఘరానా మోసం, 20లక్షలు పొగొట్టుకున్న టెకీ..