ఏసీబీ దాడులు : నర్సీపట్నం మున్సిపల్ కమీషనర్ ఇంట్లో సోదాలు

  • Publish Date - February 20, 2019 / 04:22 AM IST

విశాఖపట్నం: ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి  ఉన్నారనే ఆరోపణలపై నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ శంకర్రావు ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.  విశాఖతో పాటు విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఎనిమిది చోట్ల ఏసీబీ అధికారులు సోదారు జరుపుతున్నారు. విజయనగరం జిల్లా నుంచి విశాఖజిల్లా  నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయానికి శంకర్రావు ఇటీవలే బదిలీ అయ్యారని  ఏసీబీ డీఎస్పీ  రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. సోదాలు కొనసాగుతున్నాయి.