లైంగిక వేధింపుల ఆరోపణలు : హార్పిక్ తాగిన అడ్వకేట్

  • Publish Date - April 26, 2019 / 06:21 AM IST

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అడ్వకేట్ ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నించాడు. పోలీసులను చూసి భయపడి హార్పిక్ తాగాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు అతడిని సికింద్రబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇతని పరిస్థితి నిలకడగానే ఉందని..ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన చిలకలగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. 

రామారావు అనే వ్యక్తి అడ్వకేట్‌గా వ్యవహరిస్తున్నాడు. తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని జూనియర్ అడ్వకేట్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పట్టుకోవడానికి ఏప్రిల్ 26వ తేదీ శుక్రవారం ఇంటికి వెళ్లారు. వెంటనే రామారావు ఇంట్లోని బాత్ రూంలోకి వెళ్లి హార్పిక్ తాగాడు. పోలీసులు అలర్ట్ అయి ఆస్పత్రికి తరలించారు. గతంలో రేవంత్ రెడ్డిపై పలు ఆరోపణలు చేసిన అడ్వకేట్ ఇతనే అని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.