×
Ad

Hyderabad : చందానగర్‌లో మహిళా న్యాయవాది ఆత్మహత్య

హైదరాబాద్ చందా నగర్ లో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఒక యువ మహిళ న్యాయవాది బలవన్మరణానికి పాల్పడింది.

  • Published On : April 17, 2022 / 04:12 PM IST

Advocate Sivani Suicide

Hyderabad  : హైదరాబాద్ చందా నగర్ లో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఒక యువ మహిళ న్యాయవాది బలవన్మరణానికి పాల్పడింది. లక్ష్మీ విహార్ ఫేజ్-1 డిఫెన్స్ కాలనీలో నివసించే న్యాయవాది శివాని ఐదేళ్ల క్రిందట అర్జున్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.

శనివారం రాత్రి భార్యా భర్తల మధ్య గొడవ జరగటంతో ఆమె తాము నివసిస్తున్న అపార్ట్ మెంట్ నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త అర్జున్ చందానగర్ పోలీసులకు లొంగిపోయాడు.

కాగా…. శివాని తల్లి అందించిన సమాచారం ప్రకారం… శివాని కి చిన్నప్పుడే తండ్రి చనిపోతే  మేనమామ ఆమె బాధ్యతలు తీసుకుని అడ్వకేట్ ను చేశారు.   శివానిని చదివించటంతో తాను అప్పులు పాలయ్యానని అందుకోసం తనకు రూ. 10 లక్షలు ఇవ్వాలని మేనమామ వేధించేవాడు.  పెళ్ళి అయిన తర్వాత సంపాదన మేనమామకు ఎందుకిస్తావని అర్జున్, శివానిల మధ్య పలుమార్లు గొడవ జరిగింది.
Also Read : Honour Killing : యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య ?

ఈ నేపధ్యంలో శనివారం రాత్రి కూడా భార్య భర్తల మధ్య మరోసారి డబ్బుల విషయంలో గొడవ జరిగింది. దీంతో విసిగిపోయిన శివాని అపార్ట్ మెంట్ మీద  నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. శివాని తన కుమారుడి రెండో పుట్టినరోజు ఆదివారం  జరుపుకోవాల్సి ఉండగా ఈ ఘటన జరగటంతో వారింట విషాదం చోటు చేసుకుంది. మృతురాలి సోదరి,తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చందా నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.