ఆర్మీ జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడి జరిపారు. తూర్పు ఆప్గనిస్తాన్ లోని నంగర్హార్ ప్రావిన్స్‌లోని జలాలాబాద్ సిటీలో కొత్తగా ఆర్మీలో చేరినవారిని తీసుకెళ్తున్న బస్సును టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు దాడి జరిపారు. సైనిక వాహనానికి సమీపంలో రిక్షాలో పేలుడు పదార్ధాలుంచి ఈ ఘటనకు పాల్పడ్డారు.
ఈ బ్లాస్ట్ లో 10మందికి పైగా చనిపోయారు. 27మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అయితే ఈ దాడికి తమదే బాధ్యత అని ఇంతవరకు ఎవరూ ప్రకటించలేదు. అయితే తూర్పు ఆప్గనిస్తాన్ లో..మరీ ముఖ్యంగా నంగర్హార్ ప్రావిన్స్‌లో తాలిబన్లు,ఐసిస్ ఉగ్రవాదులు యాక్టివ్ గా ఉన్నారు.