MLA Mahesh Reddy Followers : పరిగి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి అనుచరులపై భూకబ్జా ఆరోపణలు

మహేశ్ రెడ్డి అనుచరులు తమ భూమిపై కన్నేశారని నవీన్ అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు. 346 సర్వే నెంబర్లో శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి తను అగ్రిమెంట్ చేసుకున్న 4 ఎకరాల భూమికి పెన్సింగ్ వేస్తుండగా ఎమ్మెల్యే అనుచరులు దాడికి దిగారని తెలిపారు.

MLA Mahesh Reddy Followers : వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి అనుచరుల భూకబ్జా బాగోతం వెలుగు చూసింది. పూడూరు మండలం చన్గోముల్ లో భూకబ్జాకు ఎమ్మెల్యే అనుచరులు ప్రయత్నించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాధితులకు అనుచరులకు ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి సెటిల్ మెంట్ కుదుర్చేందుకు ప్రయత్నించారని, భూకబ్జాకు పాల్పడిన అనుచరులకు మద్ధతుగా నిలిచారని తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి తెలిపింది.

మహేశ్ రెడ్డి అనుచరులు తమ భూమిపై కన్నేశారని నవీన్ అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు. 346 సర్వే నెంబర్లో శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి తను అగ్రిమెంట్ చేసుకున్న 4 ఎకరాల భూమికి పెన్సింగ్ వేస్తుండగా ఎమ్మెల్యే అనుచరులు దాడికి దిగారని తెలిపారు. కర్రలు, రాడ్లతో దాడి చేశారని, ట్రాక్టర్ తో పెన్సింగ్ పగలగొట్టి, బైక్ తగలబెట్టి భయబ్రాంతులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే ఒత్తిడితో పట్టించుకోవడం లేదని తెలిపారు.

Etela Rajender land scam :ఈటల భూకబ్జా నిజమేనని నిర్ధారణ..అసలు హక్కుదారులకు భూములు పంచాలని ప్రభుత్వం నిర్ణయం

ఇరువర్గాల మధ్య సెటిల్ మెంట్ కుదుర్చేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కోర్టుల చుట్టూ తిరుగుతారని, ఎంతోకొంత తీసుకొని వదిలేయాలని అనుచరులకు చెబుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులకు తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి బాసటగా నిలిచింది. భూకబ్జాలకు, దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

తమ పొలంలో పనులు చేసుకుంటూ ఉండగా వచ్చి ట్రాక్టర్ లతో గుద్ది, రాడ్లతో కొట్టి బైక్ లను తగలబెట్టారని బాధితులు వాపోయారు. అడిగితే తమకు ఎమ్మెల్యే సపోర్టు ఉందని ఏం చేసుకుంటారో చేసుకోండని నోటికి వచ్చినట్లుగా తిట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. పోలీసులు చర్యలు తీసుకుంటామని చెప్పారని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు