Etela Rajender land scam :ఈటల భూకబ్జా నిజమేనని నిర్ధారణ..అసలు హక్కుదారులకు భూములు పంచాలని ప్రభుత్వం నిర్ణయం

టీఆర్ఎస్ మాజీ నేత..మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై వచ్చిన భూకబ్జా ఆరోపణలు నిజమని అధికారులు నిర్ణయించారు. దీంతో ఆ భూముల్ని అసలైన హక్కుదారులకు పంచాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఎన్నో ఏళ్లుగా ఈటల కుటుంబం చేతిలో ఉన్న భూములు ఎట్టకేలకు అసలు హక్కుదారులకు చేరనున్నాయి.

Etela Rajender land scam :ఈటల భూకబ్జా నిజమేనని నిర్ధారణ..అసలు హక్కుదారులకు భూములు పంచాలని ప్రభుత్వం నిర్ణయం

Etela Rajender Land Grabbing Case

Etela rajender land grabbing case :  టీఆర్ఎస్ మాజీ నేత..మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై వచ్చిన భూకబ్జా ఆరోపణలు నిజమని అధికారులు నిర్ణయించారు. దీంతో ఆ భూముల్ని అసలైన హక్కుదారులకు పంచాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఎన్నో ఏళ్లుగా ఈటల కుటుంబం చేతిలో ఉన్న భూములు ఎట్టకేలకు అసలు హక్కుదారులకు చేరనున్నాయి. ఈటల చేసిన భూ కబ్జా కేసుపై విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు కబ్జా జరగటం నిజమేనని తేల్చారు.
అధికారులు చేపట్టిన ఈ విచారణలో రెండు గ్రామాలకు పరిధిలోని మొత్తం 85.19 ఎకరాల అసైన్డ్ భూమి ఆక్రమణకు గురైనట్లుగా గుర్తించారు. ఈటల భార్య జమున హాచరీస్ అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నట్లుగా రెవెన్యూ అధికారులు నిర్ధారించారు.

అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో అసైన్డ్ భూములను ఈటల కుటుంబం ఆక్రమించుకున్నట్లుగా నిర్ధారణ జరిగింది. దీంతో ఈ భూమిని 65మంది అసలు హక్కుదారులకు..లేదా వారి వారసులకు పంచాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంట్లో భాగంగా ఇప్పటికే మాసాయి పేటకు చేరుకున్న అధికారులు ఈ భూములకు సంబంధించి పత్రాలను రెడీ చేసే పనిలో పడ్డారు. దీని కోసం మంగళవారం (జూన్ 28,2022) సాయంత్రం కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ తో పాటు పలువురు అధికారులు ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. ఈ భూముల్ని అసలైన హక్కుదారులకు అందజేసేందుకు ప్రత్యేక బృందం అధికారులు కూడా బిజీ బిజీగా ఉన్నారు. దీంతో ఈరోజే అంటే 29వ తేదీయే అసలైన హక్కుదారులకు భూముల్ని పంచనుంది ప్రభుత్వం.

కాగా మెదక్ జిల్లా మాసాయిపేట మండలానికి చెందిన కొంతమంది బాధితులు తమ భూముల్ని ఈటల ఆక్రమించుకున్నారని గత ఏడాది సీఎం కేసీఆర్ కు మొరపెట్టుకున్నారు. 1994లో తమకు ప్రభుత్వం కేటాయించిన భూముల్ని ఈటల రాజేందర్ తో పాటు ఆయన అనుచరులు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని సీఎంకు విన్నవించుకున్నారు. ఆక్రమించుకున్న భూముల్లో జమున హాచరీస్ కు చెందిన పౌల్ట్రీ షెడ్లు నిర్మించారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు.

దీంతో సీఎం కేసీఆర్ ఈ భూ కబ్జాపై విచారణకు ఆదేశించారు. దీంతో జమున హాచరీస్ యాజమాన్యం హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేసింది. అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవచ్చని ఆ పిటీషన్ ను నిలుపుదల చేసింది హైకోర్టు. హైకోర్టు ఆదేశాలతో మెదక్ జిల్లా కలెక్టర్ ఈ భూ వివాదంపై విచారణ జరిపారు. భూ బాధితులను కలెక్టర్ స్వయంగా కలిసి వివరాలను సేకరించారు. అనంతరం అన్ని వివరాలతో కలిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.ఈటల ఆయన అనుచరులు తమ భూముల్ని లాక్కున్నారని కలెక్టర్ నివేదికలో పొందుపరిచారు.

హకీంపేటలోని సర్వే నంబర్ 97, అచ్చంపేటలోని సర్వే నంబర్ 77,78,79,80,81,82,130లో ఈటల భూముల్ని ఆక్రమించారని కలెక్టర్ నిర్ధారించారు. ఈ వివరాలను నివేదికలో పొందుపరిచారు. అలా మొత్తం 85.19 ఎకరాల భూమిని జమున హాచరీస్ ఆక్రమించుకున్నట్లుగా తెలిపారు. అసైన్డ్ ల్యాండ్ ఏక్ట్ 1977 ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నివేదికలో పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం కబ్జా అయిన ఆ భూముల్నిఅసలైన లబ్దిదారులకు అంజేసే ఏర్పాట్లు చేసింది.