ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్త ప్రణయ్ తన కళ్ల ఎదుటే దారుణంగా హత్యకు గురయ్యాడు. అది చూసి జీర్ణించుకోలేకపోయింది అమృత.. తన భర్తను హత్యచేయించడాని తండ్రిని జైలుకు పంపింది. బెయిల్ మీద వచ్చిన తండ్రి కూడా మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. తన భర్త దూరమయ్యాడని పుట్టెడు దు:ఖంలో మునిగిన అమృతకు ఇప్పుడు తండ్రి కూడా దూరమవ్వడం ఆమెకు గుండెకోతను మిగిల్చింది.
కట్టుకున్న భర్తను చంపిన తండ్రికి శిక్ష పడాలని కోరుకుంది. ఆ తండ్రే చనిపోయాడు అని తెలిసిన అమృత బాధపడాలా? లేదా భర్తను చంపినందుకు తగిన శిక్ష పడిందిలే అని సంతోషపడాలో తెలియని పరిస్థితి. తన భర్తను మారుతీరావు చంపినప్పటికీ ఎంతైనా తండ్రి కదా బాధ ఉండటం సహజమే.. అప్పుడు భర్తను పొగట్టుకుంది.. ఆ బాధ నుంచే ఇంకా అమృత తేరుకోలేదు. ఇప్పుడు కన్నతండ్రిని కూడా కోల్పోయింది. ఇదే.. అమతృ, ప్రణయ్, మారుతీరావుల కథ..
మారుతీరావు.. ఆ పశ్చాత్తాపంతోనే !
భర్తను చంపాడని తండ్రిని తండ్రిగా ఒప్పుకోలేకపోతుంది. కన్నకూతురి కాపురం బాగుండాలని కోరాల్సిన తండ్రి తన నుదుటిపై బొట్టును చెరిపేశాడనే కోపం ఆమెలో కనిపిస్తోంది. అందుకే మారుతీరావును తండ్రీగా అంగీకరించలేకపోతోంది. తండ్రి చనిపోయాడని తెలిసి ప్రణవ్ తల్లిదండ్రులు అమృతను వెళ్లి రావాల్సిందిగా చెప్పి పంపారు. కానీ, మారుతీరావు అంత్యక్రియలకు బంధువులు అమృతను రానివ్వలేదు. దాంతో చేసేది ఏమిలేక తండ్రిని ఆఖరి చూపు చూసి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
కన్నతండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త మీడియా ద్వారా తెలుసుకున్న అమృత తన ఆవేదనను వెలిబుచ్చింది. తన భర్తను చంపి తప్పు చేశానని పశ్చాత్తాపంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ఆమె అభిప్రాయపడింది. ప్రణవ్ హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు మారుతీరావు చివరి ప్రయత్నంగా అమృతను ప్రలోభాలకు గురిచేశాడు. అయినప్పటికీ అమృత దారికి రాకపోవడంతో ఆత్మహత్య శరణ్యమని భావించి మారుతీరావు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టుగా సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తోంది.
ఈ ఇద్దరి చావుకు తానే కారణమని :
తండ్రి మారుతీరావు ఆత్మహత్యతో అమృత షాక్‌కు గురైంది. భర్తను చంపి తండ్రి జైలుకెళ్లి వచ్చాడు. కన్నతండ్రి కూడా చనిపోయాడు. దీని అంతటికి అమృతే కారణమంటూ పలువురు ఆమెను విమర్శిస్తున్నారు. అమృత చేసిన తప్పు కారణంగా ఇద్దరి ప్రాణాలు పోయాయని తిట్టిపోస్తున్నారు. రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. తండ్రి, భర్త ఇద్దరి చావుకు తానే కారణమని అమృత తనలోనే తాను కుమిలిపోతుందంట. అందుకే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇప్పుడు భర్త ప్రణయ్ తనతో లేడు. తండ్రి మారుతీరావు కూడా దూరమయ్యాడు. ఇక మిగిలింది కన్న కొడుకు, తల్లి మాత్రమే. వీరిద్దిరి కోసం అమృత షాకింగ్ నిర్ణయం తీసుకుందంట.
కన్న తల్లి కోసమే ఈ నిర్ణయం? :
భర్త లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవించిన అమృత.. తన తల్లి విషయంలోనూ అలానే ఆలోచిస్తుందంట. తండ్రి ఆత్మహత్యతో అమృత తల్లి గుండె పగిలింది. ఈ పరిస్థితుల్లో తన తల్లి కూడా ఏమైనా అఘాయిత్యం చేసుకుంటుందేమోననే అమృత భయపడిపోతుందంట. భర్త ఎలాగో పోయాడు.. తండ్రి కూడా పోయాడు.. ఇక మిగిలింది.. కన్నతల్లి కనుక ఆమెకోసమైనా ఇంటికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుందంట. బతికినంత కాలం తండ్రి ఇంటికి రమ్మని పిలిచిన వెళ్లని అమృత కన్నతల్లి కోసం కన్నకొడుకుతో కలిసి వెళ్లాలని నిర్ణయం తీసుకుందని సమాచారం.
See More :
* మారుతీరావు ఆత్మహత్య: ఆస్తుల కోసమే అమృతను బంధువులు రానివ్వలేదా?!
* మారుతీరావు ఫోరెన్సిక్ నివేదిక : ఏ పాయిజన్ తీసుకున్నాడు..విస్రా శాంపిల్ సేకరణ
* మారుతీరావు అంత్యక్రియల్లో ఉద్రిక్తత..అమృతా రావద్దు..ఆయన ఆత్మ శాంతించదు