Maharashtra Liquor Seized : యాడికిలో భారీగా మహారాష్ట్ర మద్యం పట్టివేత

అనంతపురం జిల్లా యాడికి పోలీసులు బోలెరో వాహనంలో తరలిస్తున్నమహారాష్ట్ర మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 3.84 లక్షల విలువ చేసే 2400 మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు.

Atp Liquor Seize

Maharashtra Liquor Seized :  అనంతపురం జిల్లా యాడికి పోలీసులు బోలెరో వాహనంలో తరలిస్తున్నమహారాష్ట్ర మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 3.84 లక్షల విలువ చేసే 2400 మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు.

యాడికి మండలంలోని జాతీయ రహదారి 67 పై  కొత్త పెండేకల్లు గ్రామం వద్ద శనివాపం పామిడి పోలీసులు తనిఖీలు చేస్తుండగా….తెలంగాణకు చెందిన బొలెరో వాహనంలో ఈ మద్యం బాటిళ్లను అక్రమంగా తరలిస్తున్నారు. మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, వీటిని తరలిస్తున్న వ్యక్తిని బోలెరో వాహానాన్ని తాడిపత్రి పోలీసు స్టేషన్ లో అప్పగించారు.

Also Read : Cyber Crimes : హైదరాబాద్‌లో పెరుగుతున్న సైబర్ నేరాలు