Slapgate From Noida: మరో సెక్యూరిటీ గార్డుపై మహిళ దాడి.. నెల రోజుల్లో నోయిడాలో రెండో ఘటన

నోయిడాలో మరో మహిళ, మరో సెక్యూరిటీ గార్డుపై దాడికి పాల్పడింది. ఇక్కడ కూడా గేటు త్వరగా తెరవలేదనే కారణంతోనే గార్డుపై దాడి చేసింది ఆ మహిళ. గత నెలలో కూడా నోయిడాలో ఒక మహిళ ఇలాగే సెక్యూరిటీ గార్డుపై దాడి చేసిన సంగతి తెలిసిందే.

Slapgate From Noida: సెక్యూరిటీ గార్డుపై మహిళ దాడికి పాల్పడ్డ ఘటన మరోసారి నోయిడాలో జరిగింది. గత నెలలో ఒక మహిళ నోయిడాలోనే సెక్యూరిటీ గార్డుపై దాడికి పాల్పడింది. ఈ ఘటన మరువక ముందే తాజా ఘటన జరగడం గమనార్హం.

PM Modi: ఎస్‌సీఓ సమ్మిట్‌కు హాజరుకానున్న మోదీ.. పుతిన్, జిన్‌పింగ్‌తో భేటీ?

నోయిడా, ఫేజ్-3 పోలీస్ స్టేషన్ పరిధిలోని క్లియో కౌంటీలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నోయిడాలోని ఫేజ్-3 కొత్వాలి ఏరియాలో ఒక అపార్టుమెంట్‌కు సంబంధించి అక్కడి గేటు తీయడంలో సెక్యూరిటీ గార్డులు ఆలస్యం చేశారు. దీంతో కోపం తెచ్చుకున్న మహిళ వారిలో ఒక సెక్యూరిటీ గార్డుపై దాడి చేసింది. అతడి చెంపలపై కొట్టింది. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది.

Electricity Bill Scam: ఎలక్ట్రిసిటీ బిల్ స్కాం.. ఆ మెసేజ్‌లతో జాగ్రత్త.. లేకుంటే బ్యాంకు ఖాతాలు ఖాళీ

ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. గత నెలలో కూడా ఇలాంటి ఘటన నోయిడాలోనే జరిగిన సంగతి తెలిసిందే. భవ్యా రాయ్ అనే ఒక మహిళా ప్రొఫెసర్‌.. అక్కడి సెక్యూరిటీ గార్డుపై దాడికి పాల్పడింది. దీంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు భవ్యారాయ్‌ను అరెస్టు చేశారు. తర్వాత ఆమె బెయిల్‌పై విడుదలైంది.