Electricity Bill Scam: ఎలక్ట్రిసిటీ బిల్ స్కాం.. ఆ మెసేజ్‌లతో జాగ్రత్త.. లేకుంటే బ్యాంకు ఖాతాలు ఖాళీ

మీ మొబైల్ ఫోన్‌కు కరెంట్ బిల్లు కట్టలేదని, వెంటనే బిల్లు చెల్లించాలని వచ్చే మెసేజ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఎలక్ట్రిసిటీ బిల్ స్కాంలో ఎక్కువ మంది యూజర్లు నష్టపోయినట్లు పోలీసులు తెలిపారు.

Electricity Bill Scam: ఎలక్ట్రిసిటీ బిల్ స్కాం.. ఆ మెసేజ్‌లతో జాగ్రత్త.. లేకుంటే బ్యాంకు ఖాతాలు ఖాళీ

Electricity Bill Scam: దేశంలో సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. ఈ విషయంలో ఆన్‍‌లైన్‍‌ యూజర్లను ఎంత అప్రమత్తం చేసినా సరే కేటుగాళ్లు కొత్త దారుల్లో దోపిడీకి పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో కొత్తగా పుట్టుకొచ్చిన ఆన్‍‌లైన్‍‌ స్కాం ఎలక్ట్రిసిటీ బిల్ స్కాం.

Krishnam Raju: కృష్ణంరాజు మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలువురి సంతాపం

కొన్ని నెలలుగా ఎక్కువ మంది మోసపోయిన సైబర్ క్రైమ్‌లలో ఇదీ ఒకటి. ఈ స్కాం విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ స్కాంకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. యూజర్ల ఫోన్లకు ఒక టెక్స్ట్ మెసేజ్ లేదా వాట్సాప్ మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్‌లో ఒక లింక్ కూడా ఉంటుంది. కరెంట్ బిల్లు ఇంకా కట్టలేదని, రాత్రిలోపు కరెంట్ బిల్ కట్టకుంటే కనెక్షన్ తొలగిస్తామని విద్యుత్ శాఖ నుంచి వచ్చినట్లుగా ఒక మెసేజ్ పంపుతారు. ఈ మెసేజ్‌లో కనిపించిన లింక్‌పై క్లిక్ చేసి వెంటనే బిల్లు చెల్లించాలని అందులో ఉంటుంది. ఎవరైనా యూజర్లు ఇది నిజమేనని నమ్మి ఆ లింక్‌పై క్లిక్ చేస్తే అంతే. యూజర్ల బ్యాంకు అకౌంట్లోని డబ్బు అంతా స్కామర్ల అకౌంట్లోకి వెళ్లిపోతుంది.

Krishnam Raju: కృష్ణంరాజు మృతిపై మోదీ సంతాపం.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు కేసీఆర్ ఆదేశం

అందుకే ఇలా కరెంట్ బిల్లుల పేరిట వచ్చే లింక్‌పై క్లిక్ చేయకూడదని పోలీసులు సూచిస్తున్నారు. ఈ స్కామ్ ఎక్కువగా ఝార్ఖండ్ నుంచి జరుగుతున్నట్లు ఇటీవల పోలీసులు గుర్తించారు. వీరు యూజర్లకు మెసేజ్‌లు పంపేందుకు ఒకేసారి భారీ సంఖ్యలో సిమ్ కార్డులు కొనుగోలు చేస్తారు. తప్పుడు ధృవపత్రాలతో ఒక బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. అలా ఫేక్ మొబైల్ నెంబర్ల నుంచి మెసేజ్‌లు పంపి, తప్పుడు బ్యాంక్ అకౌంట్లకు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులకు సంబంధించి ఇటీవల ఢిల్లీ పోలీసులు 65 మందిని అరెస్టు చేశారు.