Krishnam Raju: కృష్ణంరాజు మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలువురి సంతాపం

సినీ నటుడు కృష్ణంరాజు మృతిపై పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన మరణం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని, తెలుగు సినీ పరిశ్రమకు ఆయన మరణం తీరని లోటని పేర్కొన్నారు.

Krishnam Raju: కృష్ణంరాజు మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలువురి సంతాపం

Updated On : September 11, 2022 / 8:56 AM IST

Krishnam Raju: ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో కృష్ణంరాజు అనేక సినిమాల్లో కథానాయకుడిగా నటించి, విలక్షణ నటనా శైలితో రెబల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని కేసీఆర్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు అరుదైన ఫోటోలు..

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు కృష్ణంరాజు మృతిపై సంతాపం ప్రకటించారు. కృష్ణంరాజు మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చంద్రబాబు ప్రకటించారు. కృష్ణంరాజు మరణం సినీ లోకానికి తీరని లోటు అని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు రేవంత్ రెడ్డి. బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తదితరులు సంతాపం ప్రకటించారు.