PM Modi: ఎస్‌సీఓ సమ్మిట్‌కు హాజరుకానున్న మోదీ.. పుతిన్, జిన్‌పింగ్‌తో భేటీ?

ఈ నెల 15, 16 తేదీల్లో జరిగే షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్‌కు హాజరుకానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మొత్తం 15 దేశాధినేతలు ఈ సదస్సులో పాల్గొనబోతున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ కూడా హాజరవుతున్నారు.

PM Modi: ఎస్‌సీఓ సమ్మిట్‌కు హాజరుకానున్న మోదీ.. పుతిన్, జిన్‌పింగ్‌తో భేటీ?

PM Modi: ఉజ్బెకిస్తాన్‌లో జరగనున్న ఎస్‌సీఓ (షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్) సమ్మిట్‌కు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో ఈ సమ్మిట్ జరుగుతుంది. దీనికి 15 మంది ప్రపంచ నేతలు మాత్రమే హాజరవుతున్నారు.

Krishnam Raju: కృష్ణంరాజు మృతిపై మోదీ సంతాపం.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు కేసీఆర్ ఆదేశం

ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ కూడా హాజరవుతున్నారు. కోవిడ్ తర్వాత ఈ సదస్సు ప్రత్యక్షంగా జరగడం ఇదే మొదటిసారి. గతంలో చివరిసారిగా 2019లో కిర్గిస్తాన్‌లోని బిషెక్ పట్టణంలో ఈ సదస్సు జరిగింది. మోదీ 14న ఉజ్బెకిస్తాన్‌లోని సమర్కంద్ చేరుకుంటారు. ఈ సదస్సుకు మోదీ, పుతిన్, జిన్‌పింగ్‌తోపాటు పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ సహా పలు దేశాధినేతలు హాజరుకానున్నారు. అయితే, ఈ సదస్సు షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. ఇక్కడ మోదీ, జిన్‌పింగ్‌ మధ్య భేటీ జరుగుతుందా? లేదా? అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.

Krishnam Raju: కృష్ణంరాజు మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలువురి సంతాపం

వీరిద్దరి సమావేశాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటీవల చైనా-భారత్ సరిహద్దులోని భద్రతా దళాల్ని ఉపసంహరించుకోవాలని ఇరు దేశాలూ నిర్ణయించాయి. ఇక ఎస్‌సీఓలో ఇండియా, చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, పాకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బెలారస్, ఇరాన్, మంగోలియా, ఆర్మేనియా, అజర్ బైజాన్, కంబోడియా, నేపాల్, శ్రీలంక, టర్కీ సభ్య దేశాలుగా ఉన్నాయి.