Gold Selling Illegally : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో బంగారం అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. మైలార్ దేవ్ పల్లిలో బంగారం అక్రమంగా విక్రయిస్తుండగా ఎస్ వోటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.50 లక్షలు విలువ చేసే బంగారాన్ని సీజ్ చేశారు.
విజిట్ విసాపై దుబాయ్ వెళ్లి బంగారాన్ని అక్రమంగా తరలించినట్లు నిందితులు ఒప్పుకున్నారు. నిందితులు సయ్యద్ మోహీద్ పాషా, సమీర్ ఖాన్, మహ్మద్ హర్షద్ లను పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులకు పోలీసులు అప్పగించారు.