Suicide : అత్తను గర్భవతిని చేసిన మేనల్లుడు.. చివరికి తీవ్ర విషాదం

చాలాకాలంగా ప్రేమ వ్యవహారం నడిపారు. శారీరకంగా దగ్గర కూడా అయ్యారు. ఈ క్రమంలోనే ఆమె గర్భం దాల్చింది. దీంతో వారి ప్రేమ వ్యవహారం బయటపడింది. పెళ్లి కాకుండానే యువతి గర్భం దాల్చడంతో..

Aunt Nephew Commits Suicide

Aunt Nephew Commits Suicide : ఆమె వయసు 18ఏళ్లు. అతడి వయసు 19ఏళ్లు. మేనల్లుడు వరుస అవుతాడు. అయినా ఆమె, అతడు ప్రేమలో పడ్డారు. చాలాకాలంగా ప్రేమ వ్యవహారం నడిపారు. శారీరకంగా దగ్గర కూడా అయ్యారు. ఈ క్రమంలోనే ఆమె గర్భం దాల్చింది. దీంతో వారి ప్రేమ వ్యవహారం బయటపడింది. పెళ్లి కాకుండానే యువతి గర్భం దాల్చడంతో కుటుంబసభ్యులు షాక్ తిన్నారు. గర్భానికి కారణం ఎవరో చెప్పాలని ఆమెను నిలదీశారు. ఆమె చెప్పిన సమాధానం విన్నాక వాళ్ల గుండెలు బద్దలయ్యాయి. ఎందుకంటే ఆ గర్భం చేసిన యువకుడు సదరు యువతికి మేనల్లుడి వరస. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సీధీ జిల్లాలో వెలుగు చూసింది.

వీళ్లిద్దరి బంధాన్ని కుటుంబం అంగీకరించ లేదు. ఇలాంటి బంధాలను సమాజం ఒప్పుకోదని, ఎవరి దారి వాళ్లు చూసుకుంటే మంచిదని అమ్మాయి తల్లిదండ్రులు హితవు చెప్పారు. అయినా ఆ యువకుడు వినలేదు. తాను ఆమెనే పెళ్లి చేసుకుంటానని తేల్చిచెప్పాడు. ఆమె కూడా అతడినే వివాహమాడతానని మొండిపట్టు పట్టింది. దీంతో విసుగెత్తిన ఆ తల్లిదండ్రులు.. కుర్రాడిని ఇంటి నుంచి పంపేశారు. అక్కడి నుంచి తన ఇంటికి బయలుదేరిన ఆ యువకుడు.. ఇంటికెళ్లలేదు.

అర్థరాత్రి మరోసారి అమ్మాయి ఇంటికెళ్లాడు. బయటకొచ్చిన యువతి అతనితో పారిపోయింది. ఎలాగూ కలిసి జీవించలేము అనుకున్నారో మరో కారణమో కానీ వారు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. సోన్ వంతెన పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వారి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. యువతీ యువకుల మృతితో ఇరు కుటుంబాల్లో విషాదం అలుముకుంది.