Road Accident : ఆటో బోల్తా-పలువురికి గాయాలు

కృష్ణాజిల్లా హనుమంతుల గూడెం వద్ద ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి  గాయాలయ్యాయి. 

Auto Accident Krishna District

Road Accident :  కృష్ణాజిల్లా హనుమంతుల గూడెం వద్ద ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి  గాయాలయ్యాయి.  కొత్తపల్లికి చెందిన ఒక కుటుంబం విస్సన్నపేటలో జరిగిన శుభకార్యానికి   ఆటోలో   వెళ్లారు.  శుభకార్యం అనంతరం  తిరిగి కొత్తపల్లికి  ఆటోలో వెళ్తుండగా హనుమంతులగూడెం వద్ద ఆటో బోల్తా పడింది.

ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలు కాగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కుటుంబ సభ్యుల మధ్య, ఆటో డ్రైవర్ కు మధ్య జరిగిన  వివాదంలో ఆటోలోని మహిళ డ్రైవర్ పై దాడి చేసింది. దీంతో డ్రైవర్ అదుపుతప్పిన  ఆటో బోల్తా పడింది. సంఘటనా స్ధలానికి చేరుకున్న రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారికి  సమీపంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించారు.