60ఏళ్ల వృద్ధురాలు అని చూడకుండా…దారుణంగా

వెస్ట్ బెంగాల్ లో ఓ 60ఏళ్ల వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. వృద్ధురాలు అన్న కనికరం కూడా లేకుండా అతి దారుణంగా హత్య చేసిన ఈ ఘటన దక్షిణ కోల్‌కతాలో కలకలం రేపింది.  ఆమెను కత్తితో పొడిచిచంపడంతోపాటు తలను నరికిశారు. పొట్టను చీల్చి వేశారు. గురువారం జరిగిన ఈ ఘటనలో చనిపోయిన మహిళను పంజాబ్‌కు ఊర్మిళ కుమారిగా గుర్తించారు.

ఊర్మిళ కుమారి తన ఇద్దరు కొడుకులతో గత కొన్నాళ్లుగా కోల్ కతాలో నివసిస్తోంది. కుమారులు ఇద్దరు  వివాహానికి హాజరయ్యేందుకు వేరే నగరానికి వెళ్లారు. దీంతో ఆమె రెండు రోజులుగా ఒంటరిగానే వుంటోంది.  ఈ విషయాన్ని గమనించిన దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడి వుంటారని పోలీసులు భావిస్తున్నారు.  శరీరంపై అనేక కత్తిపోట్లు ఉన్నాయి. తలను వేరు చేయడంతోపాటు, పొత్తి కడుపును చీల్చివేశారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అయితే ఆమె శరీరంపై బంగారం ఆభరణాలు, ఇంట్లోని నగదు అలానే ఉన్నాయనీ, దీంతో పగతో చేసిన హత్యగానే ప్రాథమికంగా భావిస్తున్నామని పోలీసు జాయింట్‌  పోలీసు కమిషనర్ మురళీధర శర్మ అన్నారు.

ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసు జాయింట్ కమిషనర్ మురళీధర శర్మ…ఇప్పటికే కొన్నిఆధారాలు సేకరించాం. ఆధారాల సేకరణలో భాగంగా సీసీపుటేజీని పరిశీలిస్తున్నాం. మా విచారణ బృందాన్ని కలవాలని బాధితురాలి ఇద్దరు కుమారులకు సూచించడం జరిగిందని తెలిపారు. అన్ని  కోణాల్లో దర్యాప్తు సాగుతుందని వెల్లడించారు. అయితే ఊర్మిళ నివాసానికి సమీపంలోనే మద్యం దుకాణం ఉండేదనీ, దీంతో అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై పలుసార్లు ఆమె గారియాహాట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని స్థానికులు చెప్పారు. ఆ కక్షతోనే  ఈదారుణానికి  ఒడిగట్టి వుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.