Benagaluru bar Girls : బార్‌లో అశ్లీల నృత్యాలు 64 మంది మహిళలకు విముక్తి

కర్ణాటక రాజధాని బెంగుళూరులో నిబంధనలకు విరుధ్ధంగా నిర్వహిస్తున్న బార్ పై సీసీబీ పోలీసులు దాడి చేసి 9 మందిని అరెస్ట్ చేశారు. బార్ నుంచి రూ. 1.32 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Bengalore Bar

Benagaluru bar Girls :  కర్ణాటక రాజధాని బెంగుళూరులో నిబంధనలకు విరుధ్ధంగా నిర్వహిస్తున్న బార్ పై సీసీబీ పోలీసులు దాడి చేసి 9 మందిని అరెస్ట్ చేశారు. బార్ నుంచి రూ. 1.32 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఉప్పార‌పేట బార్‌లో నిబంధనలకు విరుధ్ధంగా డీజే పెట్టి అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు. ఈసందర్భంగా బార్‌లో పని చేస్తున్న 64 మంది మహిళలకు విముక్తి కల్పించారు.

వీరిలో కర్ణాటకకు చెందిన వారు 17మంది.. రాజస్ధాన్ కు చెందిన 13 మంది.. మహారాష్ట్ర, పంజాబ్‌లకు చెందిన ఎనిమిది మంది.. ఢిల్లీకి చెందిన ఆరుగురు.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఐదుగురు, మధ్య‌ప్రదేశ్ కు చెందిన ముగ్గురు, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాలు‌కు చెందిన ఇద్దరు చొప్పున ఉన్నారు.

బృహత్ బెంగుళూరు మహానగర పాలిక బార్ లైసెన్స్ రద్దు చేయాలని పోలీసులు సిఫార్సు చేశారు. బెంగుళూరులో అక్రమంగా నిర్హహిస్తున్న డ్యాన్స్ బార్ ల వ్యవహారంపై ఇటీవల రాష్ఠ్ర హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర తీవ్ర అసహనంవ్యక్తం చేస్తూ పోలీసు శాఖ దృష్టికి తీసుకువెళ్లారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.

Also Read : Beautician : భర్తతో గొడవపడి బ్యూటీషియన్ ఆత్మహత్య

కాగా…. ఇతర రాష్ట్రాల నుంచి మహిళలను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నారనే విశ్వసనీయ సమచారంతో పోలీసులు దాడి చేసి ముగ్గురిని విద్యారణ్యపుర పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాటరాయనపురకు చెందిన మధు (43), అసోంవాసి రఫికుల్‌ ఇస్లాం (21), పశ్చిమ బెంగాల్‌వాసి రుబేల్‌ మండల్‌ ఇతర ప్రాంతాలనుంచి మహిళలనవు రప్పించి దొడ్డబొమ్మసంద్ర కృష్ణ టెంపుల్‌రోడ్డులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలింది.