Bengaluru Woman : 270 సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన.. బెంగళూరు మహిళకు రూ.1.36 లక్షల జరిమానా..!

Bengaluru Woman : బెంగళూరు మహిళ హెల్మెట్ ధరించకుండా స్కూటర్‌పై ట్రిపుల్స్ వెళ్లడం తాజా ట్రాఫిక్ ఉల్లంఘనలో బయటపడింది. ఆమె దాదాపు 270 సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించింది. ఆమె వాహనం ధర కన్నా ట్రాఫిక్ చలాన్ల జరిమానా చాలా ఎక్కువ.

Bengaluru Woman : ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు ఇటీవల భారీగా పెరుగుతున్నాయి. చాలామందికి ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన లేకపోవడం ఒక కారణమైతే, మరికొంతమంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన ఇలాంటి ఉల్లంఘన కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. నివేదిక ప్రకారం.. బెంగుళూరుకు చెందిన ఒక మహిళ ట్రాఫిక్ ఉల్లంఘన కింద రూ. 1.36 లక్షలు జరిమానా పడింది.

Read Also : Apple iPhone 14 Discount : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లు.. ఎక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేయాలంటే?

పదేపదే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆమె హోండా యాక్టివా స్కూటర్‌ను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశార. ఆసక్తికరంగా.. ఆమె వాహనం ధర కన్నా ట్రాఫిక్ చలాన్ల జరిమానా చాలా ఎక్కువ. ఆ మహిళ హెల్మెట్ ధరించకుండా స్కూటర్‌పై ట్రిపుల్స్ వెళ్లడం వంటివితాజా ట్రాఫిక్ ఉల్లంఘనలో బయటపడింది. అవుట్‌లెట్ ప్రకారం.. ఆమె దాదాపు 270 సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించింది.

రోడ్డుకు రాంగ్ సైడ్‌లో రైడింగ్ చేయడం, హెల్మెట్ లేకుండా పిలియన్ రైడ్‌ని తీసుకెళ్లడం, హెల్మెట్ లేకుండా రైడింగ్ చేయడం, రైడింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ ఉపయోగించడం, ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేయడం వంటి ఉల్లంఘనలు ఉన్నాయి. బెంగళూరులో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో ఈ ఉల్లంఘనలు రికార్డయ్యాయి. మహిళ జరిమానా చెల్లించి కేసులు పరిష్కరించుకుందా లేదా అనేది స్పష్టంగా లేదు.

255 ట్రాఫిక్ ఉల్లంఘనలు.. రూ.1.34 లక్షల బకాయిలు :
డిసెంబర్ 2023లో బెంగుళూరులో ఒక వ్యక్తి తన 255 ట్రాఫిక్ ఉల్లంఘనలపై రూ.1.34 లక్షల విలువైన బకాయిలను క్లియర్ చేయమని ట్రాఫిక్ పోలీసులు నోటీసు ఇచ్చారు. డెక్కన్ హెరాల్డ్‌లోని నివేదిక ప్రకారం.. ఎలుమలై అనే వ్యక్తి రెండేళ్ల కాలంలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించాడు. ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సెంటర్ (TMC) అధిక సంఖ్యలో ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉన్న వాహనాల కోసం వెతుకుతున్నప్పుడు అతని వివరాలు బయటకు వచ్చాయి. నగరంలోని పోలీస్‌స్టేషన్‌లకు సమాచారం అందించారు. ఇలాంటి వాహనాలను గుర్తించి జరిమానాలు వసూలు చేయాలని ట్రాఫిక్ పోలీసు సిబ్బందిని కోరారు.

దీంతో పోలీసులు విచారణ జరపగా.. రోజువారీ కూలీగా పనిచేసే ఏలుమలై పేరుతో రిజిస్టర్ అయిన స్కూటర్‌లో 255 ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉన్నట్లు గుర్తించారు. అతడిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి అసలు విషయం చెప్పారు. నగరం అంతటా అమర్చిన ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ITMS) కెమెరాల గురించి తనకు తెలియదని ఏలుమలై పోలీసు సిబ్బందికి తెలిపాడు. ఎలుమలై స్పాట్ ఫైన్‌గా రూ. 10వేలు చెల్లించి 20 కేసులను పరిష్కరించినట్లు నివేదిక పేర్కొంది. పోలీసులు అతని సుజుకి యాక్సెస్ స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారని అవుట్‌లెట్ తెలిపింది.

Read Also : Apple iPhone 13 : కొత్త ఫోన్ కొంటున్నారా? ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఈ ఐఫోన్ కొనాలా? వద్దా?

ట్రెండింగ్ వార్తలు