ఏం జరిగింది? : జూబ్లీహిల్స్ వెంకటగిరిలో పేలుడు

  • Publish Date - January 29, 2019 / 01:16 PM IST

హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరి చౌరస్తాలోని అజయ్ బార్ వద్ద మంగళవారం సాయంత్రం పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఒక వృధ్దుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్ధానికులు పోలీసులకు సమాచారమిచ్చి 108 అంబులెన్స్‌లో అతడ్ని ఆసుపత్రికి తరలించారు.

 

చెత్త సేకరించుకుని వెళుతున్న ఆ వృధ్దుడు, చెత్తలో దొరికిన వస్తువును పగలగొట్టే ప్రయత్నంలో పేలుడు సంభవించిందని స్ధానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం నిపుణులు ఆధారాలు సేకరించారు. లభించిన ఆధారాలను బట్టి డిటోనేటర్ పేలినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.