Medak : కారు డిక్కీలో డెడ్‌బాడీ కేసు..మిస్టరీ వీడింది, ఎందుకు చంపారంటే

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మండల పరిధిలో కారు దగ్ధం కేసును మెదక్ జిల్లా పోలీసులు చేధించారు. వ్యాపార లావాదేవీల నేపథ్యంలో ఈ హత్య జరిగిందని పోలీసులు తేల్చారు. కోటిన్నర వ్యవహారంలో ధర్మపురి శ్రీనివాస్ కు మరొకరి మధ్య విబేధాలున్నట్లు పోలీసులు గుర్తించారు.

Medak Police

Body Found In Burned Car : మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మండల పరిధిలో కారు దగ్ధం కేసును మెదక్ జిల్లా పోలీసులు చేధించారు. వ్యాపార లావాదేవీల నేపథ్యంలో ఈ హత్య జరిగిందని పోలీసులు తేల్చారు. కోటిన్నర వ్యవహారంలో ధర్మపురి శ్రీనివాస్ కు మరొకరి మధ్య విబేధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోన్ తీసుకుని డబ్బులు ఇచ్చినా..శ్రీనివాస్ చెల్లించలేదనే ఆగ్రహంతో దుండగులు హత్య చేశారని నిర్ధారించారు.

Read More : Wildfire: హృదయాన్ని కలచివేసే దృశ్యాలు.. మండుతోన్న అడవులు.. 42 మంది మృతి

సాయంత్రం 4.30 గంటలకు రామాయంపేట రూట్ లో శ్రీనివాస్ ను కత్తితో పొడిచి హత్య చేసిన అనంతరం 10.30 గంటలకు కారును దగ్ధం చేశారు. అప్పటి వరకు కారులోనే మృతదేహంతో తిరిగారు. సాయంత్రం నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మెదక్‌ జిల్లా కారు డిక్కీలో డెడ్‌బాడీ దగ్ధం ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మెదక్‌ పట్టణానికి చెందిన రియల్టర్‌ ధర్మకారి శ్రీనివాస్‌గా గుర్తించారు పోలీసులు. హత్యకు వివాహేతర సంబంధం ఉందని తొలుత ప్రచారం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read More :Tamil Nadu : స్మార్ట్ ఆలోచన..పెళ్లి కొడుకు, పెళ్లి పిల్ల ఫిదా అవాల్సిందే

సంఘటనా స్థలంలో పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు కారు తిరిగిన ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించారు. శ్రీనివాస్ రావు హత్యలో ఎవరు పాలుపంచుకున్నారు? ఎక్కడ చంపారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకొనేలా విచారణను సీరియస్‌గా తీసుకున్నారు. నాలుగు ప్రత్యేక బృందాలతో ఇన్వెస్టిగేషన్ చేశారు. స్పీడ్ గా దర్యాప్తు చేపట్టి నిందితులు పట్టుకున్నారు.