జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో దారుణం జరిగింది. స్కూల్ లో బాంబు పేలి 19 మంది విద్యార్థులు గాయపడ్డారు. బుధవారం(ఫిబ్రవరి13,2019) మధ్యాహ్నాం 2:30గంటల సమయంలో పుల్వామా జిల్లాలోని నర్బాల్ లోని ప్రైవేట్ స్కూల్ ఫలాయి-ఈ-మిలాత్ లోని తరగతి గదిలో ఈ పేలుడు సంభవించింది. ప్రమాదసమయంలో విద్యార్థులు వింటర్ ట్యూషన్లకు హాజరయ్యారు. గాయపడిన విద్యార్థులను అధికారులు స్థానిక హాస్పిటల్ కు తరలించారు. వారి ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. తీవ్రంగా గాయడిన కొందరు విద్యార్థులను శ్రీనగర్ లోని హాస్పిటల్ కు తరలించారు. ఈ పేలుడు ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.