Greater Noida: పరీక్షలో ఫెయిలైనందుకు చితకబాదిన టీచర్.. తీవ్ర గాయాలతో 12 ఏళ్ల విద్యార్థి మృతి

నిందితుడైన టీచర్‭ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే విద్యార్థి పోస్టు మార్టం రిపోర్టులు సైతం పరిశీలిస్తున్నారట. విద్యార్థిది, టీచర్‭ది ఒకే ఊరని.. ఇద్దరి కుటుంబాలు బంబావర్ గ్రామం నుంచి గ్రేటర్ నోయిడాకు వలస వచ్చినట్లు డీసీపీ రాం బదన్ సింగ్ తెలిపారు. టీచర్‭పై భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 304 (హత్య చేయాలనే ఉద్దేశంతో నేరపూరిత చర్యకు దిగడం) కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు వారు తెలిపారు.

Greater Noida: కొద్ది రోజుల క్రితం రాజస్తాన్ రాష్ట్రంలో టీచర్ కొట్టడం వల్ల ఒక విద్యార్థి చనిపోయిన వార్త గురించి ఇంకా ఎవరూ అంత సులువుగా మర్చిపోరు. ఆ ఘటన అనంతరం కూడా దేశ వ్యాప్తంగా అలాంటి దుర్ఘటనలు అనేకం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడాలో ఇలాంటి బాధాకరమైన ఘటనే ఒకటి వెలుగు చూసింది. పరీక్షలో ఫెయిల్ అయినందుకు 12 ఏళ్ల విద్యార్థిని టీచర్ విపరీతంగా కొట్టారు. దీంతో బాలుడి మెదడులో రక్తం కారి మృతి చెందాడు.

సెంట్రల్ నోయిడా డీసీపీ రాం బదన్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రిన్స్ అనే 12 ఏళ్ల విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రమాదకర స్థితిలో మరణించాడు. అతడి మెదడులో బాగా రక్తం (బ్లీడింగ్) కారింది. కుటుంబ సభ్యులు, పాఠశాల వారు తెలిపిన ప్రకారం.. ప్రిన్స్ శుక్రవారం ఎంతో ఆరోగ్యంగా పాఠశాలకు వెళ్లాడు. అయితే టీచర్ కొట్టిన దెబ్బలకు మెదడులో రక్తం కారి ప్రమాదకర స్థితిలో ఆసుపత్రిలో చేరాడు. కుటుంబ సభ్యులు బాలుడిని రకరకాల ఆసుపత్రులు తింపి వైద్యం అందించే ప్రయత్నం చేశారు. కానీ, ప్రయత్నాలు ఫలించలేదు. సరైన సమయానికి వైద్యం అందకపోవడంతో బాలుడు మృతి చెందాడు.

నిందితుడైన టీచర్‭ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే విద్యార్థి పోస్టు మార్టం రిపోర్టులు సైతం పరిశీలిస్తున్నారట. విద్యార్థిది, టీచర్‭ది ఒకే ఊరని.. ఇద్దరి కుటుంబాలు బంబావర్ గ్రామం నుంచి గ్రేటర్ నోయిడాకు వలస వచ్చినట్లు డీసీపీ రాం బదన్ సింగ్ తెలిపారు. టీచర్‭పై భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 304 (హత్య చేయాలనే ఉద్దేశంతో నేరపూరిత చర్యకు దిగడం) కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు వారు తెలిపారు.

Dollar vs Rupee: నిర్మలా చెప్పింది నిజమేనా? రూపాయి విలువ తగ్గకుండా, డాలర్ విలువే పెరిగిందా?

ట్రెండింగ్ వార్తలు