సరిహద్దుల్లో పాక్ కాల్పులు…జవాన్,చిన్నారి మృతి

పాక్ మరోసారి బరితెగించింది.ఎల్ వోసీ దగ్గర తరచూ భారత సైన్యంపై కాల్పులకు తెగబడుతూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తుంది.పూంచ్ సెక్టార్ లో సోమవారం(ఏప్రిల్-1,2019) పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది.పాక్ కాల్పులను భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. అయితే పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఐదేళ్ల చిన్నారి సోబియా,ఓ బీఎస్ఎఫ్ జవాను మరణించగా.. ఐదుగురు జవాన్లు గాయపడ్డారని అధికారులు తెలిపారు.పాక్ కాల్పుల్లో 13మంది సామాన్య ప్రజలు గాయపడ్డారు. 
Read Also : ఆర్మీకి అవమానం : యోగి “మోడీ సేన”వ్యాఖ్యలపై దుమారం

తీవ్రంగా గాయపడిన నలుగురిని హెలికాఫ్టర్ ద్వారా జమ్మూ హాస్పిటల్ కి తరలించారు.ఇద్దరు క్షతగాత్రులను రోడ్డు మార్టంలో జమ్మూకి తరలించారు.ఏడుగురు క్షతగాత్రులు స్థానిక జిల్లా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నట్లు పూంచ్ జిల్లా అభివృద్ధి కమిషనర్ రాహుల్ యాదవ్ తెలిపారు.