Shoots Down Pakistan’ Drone : భారత్‌లోకి అక్రమంగా చొరబడిన పాక్ డ్రోన్‌ కూల్చివేత

పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్‌ కలకలం రేపింది. భారత్‌లోకి అక్రమంగా చొరబడిన పాకిస్తాన్ డ్రోన్‌ను కూల్చివేశారు. అమృత్‌సర్‌లోని రానియా సరిహద్దు ఔట్‌పోస్ట్‌ వద్ద ఓ డ్రోన్‌ను బీఎస్‌ఎఫ్‌ జవాన్లు కూల్చివేశారు.

Shoots Down Pakistan’ Drone  : పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్‌ కలకలం రేపింది. భారత్‌లోకి అక్రమంగా చొరబడిన పాకిస్తాన్ డ్రోన్‌ను కూల్చివేశారు. అమృత్‌సర్‌లోని రానియా సరిహద్దు ఔట్‌పోస్ట్‌ వద్ద ఓ డ్రోన్‌ను బీఎస్‌ఎఫ్‌ జవాన్లు కూల్చివేశారు. రానియా ఔట్‌పోస్ట్‌ సమీపంలో ఆదివారం (అక్టోబర్ 16,2022) రాత్రి పాకిస్థాన్‌ వైపు నుంచి డ్రోన్‌ భారత్‌లోకి చొచ్చుకొచ్చింది. గుర్తించిన జవాన్లు దానిపై కాల్పులు జరిపారు. దీంతో అది కూలిపోయిందని అధికారులు వెల్లడించారు.

ఆ ఆక్టా కాపర్‌ డ్రోన్ సుమారు 12 కిలోల బరువు ఉందని పేర్కొన్నారు. అది ఓ కన్సైన్‌మెంట్‌ తీసుకురావడాన్ని గుర్తించారు. అయితే అందులో ఏమున్నాయనే విషయాన్ని అధికారులు తెలియజేయలేదు. కాగా, మూడు రోజుల క్రితం గురుదాస్‌పూర్‌ సెక్టార్‌లో భద్రతా దళాలు ఓ డ్రోన్‌కు కూల్చివేశారు.

Drone Tension In India-Pak Border : 9 నెలల్లో భారత్‌లోకి 191 పాక్ డ్రోన్లు .. పంజాబ్‌లో మరో పాకిస్థాన్ డ్రోన్‌ను కూల్చివేసిన BSF బలగాలు

శుక్రవారం (అక్టోబర్ 14,2022) ఉదయం 4.30 గంటల సమయంలో భారత్‌-పాక్‌ అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్థాన్‌ వైపు నుంచి భారత్‌లోకి డ్రోన్‌ రావడాన్ని గుర్తించిన జవాన్లు దానిపై కాల్పులు జరిపారు. దీంతో గత తొమ్మిది నెలల్లో పాకిస్థాన్‌ వైపు నుంచి మొత్తం 193 డ్రోన్లు భారత్‌లోకి అక్రమంగా చొరబడ్డాయని అధికారులు పేర్కొన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ట్రెండింగ్ వార్తలు