Case Filed On Etela Rajender : ఈటల రాజేందర్‌పై కేసు నమోదు

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్  బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై కేసు నమోదయ్యింది.

  • Updated on- November 3, 2021 / 09:45 PM IST

Eetela Rajender

Case Filed On Etela Rajender :  కరీంనగర్ జిల్లా హుజూరాబాద్  బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై కేసు నమోదయ్యింది. కేంద్ర ఎన్నికల కమీషన్ నిబంధనలు ఉల్లంఘించి విజయోత్సవ ర్యాలీలో పాల్గోన్నందుకు ఆయనపై కరీంనగర్ పోలీసులు కేసునమోదు చేశారు.

మంగళవారం ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ఈటల రాజేందర్ తన అనుచరులతో కలిసి కరీంనగర్‌లోని ఎస్సారార్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి కోర్టు చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చారని పోలీసులు తెలిపారు.

Also Read :Punjab Election : కాంగ్రెస్ కోసం రంగంలోకి పీకే..సంకేతాలిచ్చిన సీఎం

కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి అనుచరులతో ర్యాలీగా వచ్చినందుకు ఈటల రాజేందర్‌, ఆయన అనుచరులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని కరీంనగర్ పోలీసులు తెలిపారు.