YS Viveka Case : వైఎస్ వివేకా కేసులో విచారణకు హాజరు కావాలని.. ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రికి సీబీఐ నోటీసులు

వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ఇవాళ (శనివారం) సీబీఐ ప్రశ్నించనుంది. శనివారం విచారణకు హాజరు కావాలని భాస్కర్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది.

YS Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ఇవాళ (శనివారం) సీబీఐ ప్రశ్నించనుంది. శనివారం విచారణకు హాజరు కావాలని భాస్కర్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.

ఫిబ్రవరి 23న విచారణకు హాజరు కావాలని భాస్కర్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది. అయితే ముందుస్తు కార్యక్రమాలతో ఆ రోజు విచారణకు హాజరు కాలేనని ఆయన సీబీఐకి చెప్పారు. నిన్న శుక్రవారం ఎంపీ అవినాశ్ రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు ఇవాళ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది.

Google Takeout : వైఎస్ వివేకా కేసులో కీలకంగా మారిన గూగుల్ టేకౌట్.. అసలేంటీ గూగుల్ టేకౌట్? ఎలా యూజ్ అవుతుంది?

అయితే కడపలోనే భాస్కర్ రెడ్డిని దర్యాప్తు బృందం అధికారులు ప్రశ్నించనున్నారు. కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌజ్ లో భాస్కర్ రెడ్డిని అధికారులు ప్రశ్నించనున్నారు. రాత్రే దర్యాప్తు బృందం అధికారులు హైదరాబాద్ నుంచి కడపకు వెళ్లారు.

ట్రెండింగ్ వార్తలు