Google Takeout : వైఎస్ వివేకా కేసులో కీలకంగా మారిన గూగుల్ టేకౌట్.. అసలేంటీ గూగుల్ టేకౌట్? ఎలా యూజ్ అవుతుంది?

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో గూగుల్ టేకౌట్ డేటా కీలకం కానుంది. వైఎస్ వివేకా హత్య జరిగిన సమయంలో నిందితులందరూ ఒకేచోట ఉన్నారని ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా సీబీఐ అధికారులు గుర్తించారు. గూగుల్ టేకౌట్ టెక్నాలజీ సాయంతో ఆ వివరాలు సేకరించినట్లుగా సీబీఐ అధికారులు తమ రిపోర్టులో తెలిపారు.

Google Takeout : వైఎస్ వివేకా కేసులో కీలకంగా మారిన గూగుల్ టేకౌట్.. అసలేంటీ గూగుల్ టేకౌట్? ఎలా యూజ్ అవుతుంది?

Google Takeout : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో గూగుల్ టేకౌట్ డేటా కీలకం కానుంది. వైఎస్ వివేకా హత్య జరిగిన సమయంలో నిందితులందరూ ఒకేచోట ఉన్నారని ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా సీబీఐ అధికారులు గుర్తించారు. గూగుల్ టేకౌట్ టెక్నాలజీ సాయంతో ఆ వివరాలు సేకరించినట్లుగా సీబీఐ అధికారులు తమ రిపోర్టులో తెలిపారు. ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితుల కదలికలను గుర్తించినట్లు వెల్లడించారు.

Also Read..YS Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసు.. ఎంపీ అవినాశ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం, ప్రధానంగా ఆ రూ.40కోట్ల డీల్ గురించే

కేసు విచారణ సమయంలో గూగుల్ సర్వీస్, క్లౌడ్ సర్వీసెస్ వద్ద ఉన్న డేటాను దర్యాఫ్తు సంస్థలు పరిగణలోకి తీసుకుంటాయి. ఇలానే వైఎస్ వివేకా కేసులో గూగుల్ టేకౌట్ డేటాను సీబీఐ సేకరించింది. గూగుల్ మ్యాప్స్, జీమెయిల్ అలాగే అన్ని రకాల గూగుల్ డేటాను ఒక చోట బ్యాకప్ గా పొందే అవకాశం ఉంది. యాండ్రాయిడ్ ఫోన్ ఉపయోగిస్తే మన ప్రతి కదలికను గూగుల్ బ్యాకప్ చేస్తుంది. ఈ బ్యాకప్ డేటాను యూజర్స్ కావాల్సినప్పుడు జిప్ ఫైల్ చేసుకుని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇది యూజర్ కోసం పెట్టిన ఫీచర్.(Google Takeout)

Also Read..Sajjala Ramakrishna Reddy : సీబీఐ ఇన్వెస్టిగేషన్ పేరుతో డ్రామా : సజ్జల

అయితే, ఇండియాలో సీబీఐ, ఈడీతో పాటు పది రకాల దర్యాఫ్తు సంస్థలకు ఈ డేటాను యాక్సెస్ చేసే పర్మిషన్ ఉంటుంది. దీని ప్రకారం వైఎస్ వివేకా కేసులో నిందితులు ఘటన జరిగిన సమయంలో ఎక్కడెక్కడ ఉన్నారు అనే సమాచారాన్ని సేకరించారు. ఇదే విచారణలో కీలకం కానుంది. ఫోన్ నెంబర్ ద్వారా అయితే కేవలం టవర్ రేడియస్ లో మాత్రమే తెలుస్తుంది. కచ్చితమైన లొకేషన్ తెలియదు. అదే గూగుల్ టేకౌట్ ద్వారా అయితే 50 మీటర్ల రేడియస్ లో నిందితుడిని గుర్తించవచ్చు.

ఏంటీ గూగుల్‌ టేకౌట్‌?
డేటాను సురక్షితంగా బ్యాకప్‌ చేయడానికి ఈ గూగుల్‌ టేకౌట్‌ అనే టూల్‌ను గూగుల్‌ అందిస్తోంది. ఇది పూర్తిగా ఉచితం. ఇది 51 రకాల డేటాను బ్యాకప్ చేస్తుంది. మెయిల్స్‌, డ్రైవ్ కంటెంట్‌, క్యాలెండర్స్, బ్రౌజర్‌లో ఉండే బుక్‌మార్క్స్‌, యూట్యూబ్‌లో మీరు రెగ్యులర్‌గా చూసే వీడియోలను కూడా బ్యాకప్ చేస్తుంది. అవసరమైనప్పుడు ఈ డేటాను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ గూగుల్‌ టేకౌట్‌ను ఉపయోగించి మొత్తం ఫొటోలను మీ పర్సనల్‌ స్టోరేజ్‌ డివైజ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అవసరం లేని, పాత ఫైల్స్‌ను వ్యక్తిగత స్టోరేజ్‌ డివైజ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి గూగుల్‌ టేకౌట్‌ డ్రైవ్‌ను ఖాళీ చేయవచ్చు. మీ Google అకౌంట్‌లో ఏ డేటా సేవ్ చేశారు. దేన్ని డౌన్‌లోడ్ చేయవచ్చో తెలుసుకోవడానికి గూగుల్‌ డాష్‌బోర్డ్‌లో కనిపిస్తుంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.