శ్రీవారి భక్తులను నమ్మించి మోసం చేస్తున్న దళారీ అరెస్టు

  • Publish Date - May 12, 2019 / 12:13 PM IST

తిరుమల శ్రీవారి భక్తులను నమ్మించి మోసం చేస్తున్న దళారీని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం గుంటూరు జిల్లాకు చెందిన కార్తీక్ అనే వ్యక్తి ఏపీ టూరిజం ద్వారా తిరుమలకు వచ్చే భక్తుల ఫోన్ నంబర్లను ట్రాప్ చేసి దర్శనం చేయిస్తానంటూ వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ లో రూ.ఐదు-పది వేలు వేయించుకున్నాడు. ఈ విధంగా డబ్బులు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు. ఓ భక్తుని కంప్లైంట్ తో తిరుమల టూటౌన్ పోలీసులు రంగంలోకి దిగారు. తెనాలిలో తిరుమల పోలీసులు కార్తీక్ ను అదుపులోకి తీసుకున్నారు.  

తిరుమల టూటౌన్ సీఐ మాట్లాడుతూ గుంటూరు జిల్లాకు చెందిన కార్తీక్ చెడు వ్యసనాలకు అలవాటుపడి తిరుమలకు వచ్చాడని తెలిపారు. కొంతమందితో సంబంధాలు ఏర్పరచుకున్నాడని చెప్పారు. తిరుమలకు వచ్చే భక్తులను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడని తెలిపారు. కార్తీక్ తో సంబంధం కలిగిన లడ్డు దళారులు, మఠంలో పనిచేస్తున్న సిబ్బందిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు.