ఏం చేసుకుంటాడో : మహిళల లోదుస్తులు ఎత్తుకెళ్తున్న సైకో.. భయాందోళనలో ప్రజలు
తమిళనాడు రాష్ట్రం అడంబాక్కంలో సైకో వ్యవహారం కలకలం రేపుతోంది. ఆ సైకో ఎవడో కానీ.. వాడి టార్గెట్ మాత్రం మహిళల లోదుస్తులే. అర్థరాత్రి వస్తాడు. ఇంటి బయట ఆరేసిన

తమిళనాడు రాష్ట్రం అడంబాక్కంలో సైకో వ్యవహారం కలకలం రేపుతోంది. ఆ సైకో ఎవడో కానీ.. వాడి టార్గెట్ మాత్రం మహిళల లోదుస్తులే. అర్థరాత్రి వస్తాడు. ఇంటి బయట ఆరేసిన
తమిళనాడు రాష్ట్రం అడంబాక్కంలో సైకో వ్యవహారం కలకలం రేపుతోంది. ఆ సైకో ఎవడో కానీ.. వాడి టార్గెట్ మాత్రం మహిళల లోదుస్తులే. అర్థరాత్రి వస్తాడు. ఇంటి బయట ఆరేసిన మహిళల అండర్ వేర్లు దోచుకెళ్తాడు. కొన్నాళ్లుగా అడంబాక్కంలోని అపార్ట్ మెంట్స్ లో మహిళల లోదుస్తులు మాయం అవుతున్నాయి. దీంతో మహిళలు భయాందోళనకు గురయ్యారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.
విచారణలో భాగంగా ఓ అపార్ట్ మెంట్ సీసీ కెమెరాని పరిశీలించారు. అందులో షాకింగ్ విజువల్స్ కనిపించాయి. లోదుస్తులు ఎత్తుకెళ్తున్న వ్యక్తిని గుర్తించారు. అతడి వయసు 40 ఏళ్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఆ వక్తి ముఖానికి మాస్క్ ఉంది. లుంగీ వేసుకుని ఉన్నాడు. కాంపౌండ్ వాల్ ద్వారా అపార్ట్ మెంట్స్ లోకి చొరబడుతున్నాడు. అంతా గాఢనిద్రలో ఉన్నారని నిర్ధారించుకున్నాక… సైలెంట్ గా లోదుస్తులు తీసుకుని వెళ్తున్నాడు. ఇంటి బయట తాళ్లపైన, కిటికీలపైన ఆరేసిన లోదుస్తులను చోరీ చేస్తున్నాడు.
రాత్రి ఇంటి బయట తాడుపై వేసిన లోదుస్తులు.. ఉదయం లేచి చూస్తే కనిపించడం లేదు. కొన్ని రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. స్థానిక అపార్ట్ మెంట్స్ లో వరుసగా చోరీలు జరిగాయి. దీంతో మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సైకో వ్యవహారం సంచలనంగా మారింది. వెంటనే అతడిని పట్టుకోవాలని పోలీసులను కోరారు. ఈ ఘటనతో మహిళలు భయాందోళన చెందుతున్నారు. కాగా, అసలు ఆ వ్యక్తి మహిళల లోదుస్తులు మాత్రమే ఎందుకు చోరీ చేస్తున్నాడు? వాటితో ఏం చేసుకుంటాడు? మెంటల్ డిజార్డర్ తో బాధపడుతున్నాడా? అనేది తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. పలు బృందాలుగా రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ వ్యక్తి కోసం వేట సాగిస్తున్నారు. వీలైనంత తొందరగా పట్టుకుంటామని చెప్పారు. ఎవరూ భయపడాల్సిన పని లేదన్నారు.