సింగపూర్ లో పురాతన దేవాలయ పూజారీ అరెస్టు ? ఏం జరిగింది ?

  • Publish Date - August 2, 2020 / 02:47 PM IST

సింగపూర్ లో ఉన్నఓ పురాతన దేవాలయ పూజారీని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. అతను దొంగతనం చేశాడనే ఆరోపణలపై అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. ఆలయానికి సంబంధించిన బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో పూజారీని అదుపులోకి తీసుకున్నారు. పూజారీ ఆధీనంలో ఈ బంగారు ఆభరణాలు ఉంటాయని తెలుస్తోంది.



సింగపూర్ లో పురాతన Mariamman Temple ఉంది. ఇక్కడ ఓ పూజారీ ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్నారు. కానీ అడిట్ చేసే సమయంలో అతను లేడని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. స్వామి వారికి ఉపయోగించే బంగారు ఆభరణాలను ఆలయ లోపలి గర్భగుడిలో…ప్రధాన పూజారీ ఆధ్వర్యంలో ఉంచుతారని వెల్లడించింది.

ప్రశ్నించిన తర్వాత…తప్పిపోయిన వస్తువులన్నింటినీ తిరిగి ఇచ్చాడని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇందులో ఇతరుల ప్రమేయం లేదని తెలిపింది. ఈ విషయాన్ని హిందూ ఎండోమెంట్ బోర్డుకు తెలియచేసింది. ప్రస్తుతం అతను బెయిల్ పై ఉన్నాడని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు