Chintapalli
Chintapalli Murder Case : చింతపల్లి మండలం మెట్టు మహంకాళి మాత పాదాల వద్ద లభ్యమైన వ్యక్తి తల మిస్టరీ వీడింది. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ వద్ద శిరస్సు లేని మొండెం లభించింది. ఓ ఇంటిపై శిరస్సు ఉందని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. దాదాపు మూడు రోజుల తర్వాత మొండెం లభ్యమైంది. జిల్లా ఎస్పీ రేమారాజేశ్వరి ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం తర్వాత పోలీసులు ఉన్నతాధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. హత్యకు గురైన వ్యక్తి సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం శూన్య పహాడ్ తండాకు చెందిన రమావత్ జై హింద్ నాయక్(30)గా ఇప్పటికే పోలీసులు, కుటుంబ సభ్యులు గుర్తించిన సంగతి తెలిసిందే.
Read More : Guwahati-Bikaner : బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన 12 బోగీలు.. ముగ్గురు మృతి
ఈ కేసులో ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేశారు. మహంకాళి ఆలయం చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు పోలీసులు. మృతుడు ఉంటున్న తుర్కయాంజల్‌పై పోలీసులు దృష్టి సారించారు. అక్కడి స్థానికులను రెండు రోజులుగా విచారించిన పోలీసులకు జైహింద్ వారం రోజులుగా కనిపించడం లేదని గుర్తించారు. ఎవరితోనో కారులో వెళ్లినట్టు వారు చెప్పినట్టు తెలుస్తోంది.. దీంతో హత్యకు వారం రోజుల ముందే జైహింద్‌ను కిడ్నాప్ చేశారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. హత్యకు గొడవలు కారణం కాదని నిర్ధారించుకున్నట్టు తెలుస్తోంది..
Read More : Mallu Bhatti Vikramarka : రామానుజాచార్యుల ఫిలాసఫీ ప్రపంచానికి అవసరం- భట్టి
దీంతో కేసు అటు తిరిగి, ఇటు తిరిగి మళ్లీ గుప్తు నిధుల వద్దకే వచ్చి ఆగింది.. ఆదివారం అర్థరాత్రి హత్య జరగడం.. కాళీ ఆలయం దగ్గర ఉంచడం.. పక్కనే పూజలు చేసినట్టు ఆనవాళ్లు ఉండటంతో ఇది గుప్త నిధుల కోసం తవ్వకాలు చేసిన పనే అని బలంగా నమ్ముతున్నారు పోలీసులు.. గతంలో ఎవరైనా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారా? ఇలాంటి బలులు ఏమైనా ఇచ్చారా? అలాంటి కేసులు ఏమైనా పోలీస్ స్టేషన్‌లలో నమోదయ్యాయా? అన్న దానిపై దృష్టి సారించారు. ఈ కేసు దర్యాప్తులో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.