ఎమ్మెల్యే ఇంట్లో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న భార్య

ఎమ్మెల్యే సతీమణి ఆత్మహత్యకు పాల్పడిన ఇంటిని పోలీసులు పరిశీలించారు.. కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

MLA Wife Suicide

Choppadandi MLA Medipally Sathyam Wife Rupadevi Suicide : కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి రూపాదేవి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ అల్వాల్ లోని పంచశీల కాలనీలోని ఇంట్లో గురువారం రాత్రి ఉరేసుకొని ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు.. కేసు నమోదు చేసుకొని ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు.

Also Read : భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం- కేంద్రమంత్రి బండి సంజయ్ హామీ

గత 12 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రూపదేవిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. రూపాదేవి మేడ్చల్ మునిరాబాద్ లోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. గత సంవత్సర కాలంగా పేట్ బషీరాబాద్ లోని దవేరియా విల్లాస్ లోని నివాసం ఉండేది. గత నెల రోజులు క్రితమే అల్వాల్ లోని పంచశీల కాలనీ రోడ్ నెంబర్ 12లో నివాసం ఉంటుంది. మృతురాలు రూపాదేవికి కుమారుడు యోజిత్ (11), కుమార్తె రిషిక శ్రీ (9) ఉన్నారు. గత కొంతకాలంగా ఎమ్మెల్యే దంపతుల మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం.

Also Read : Medchal Robbery : బాబోయ్.. బుర్ఖాలో వచ్చి, కత్తులు చూపించి.. పట్టపగలే దొంగల బీభత్సం..

భార్య మృతిని తట్టుకోలేక ఎమ్మెల్యే సత్యం ఆస్పత్రిలోనే స్పృహతప్పి పడిపోయారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కొంపెల్లిలోని రెన్నోవా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యాన్ని పరామర్శించారు. అయితే, రూపాదేవి గత రెండు రోజుల నుంచి స్కూల్ వెళ్లలేదని తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యే కుటుంబం ఇతర బంధువులతో కలిసి తిరుమల సహా పలు పుణ్యక్షేత్రాలను సందర్శించుకొని వచ్చారు. రూపాదేవి మృతదేహం కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉంది.. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించనున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు