న్యూజిలాండ్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ వ్యక్తి విచక్షణారహితంగా ఫైరింగ్ చేశాడు. ఈ ఘటన క్రైస్ట్ చర్చ్‌లోని ఆల్‌నూర్ మసీదులో చోటు చేసుకుంది. 12 మంది మృతి చెందగా ఎంతో మందికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని దుండగులను పట్టుకోవడానికి ప్రయత్నించారు. అందులో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అలర్ట్ ప్రకటించి గాలింపులు చేపట్టారు.
Read Also: కాల్పుల కలకలం : బంగ్లా క్రికేటర్లకు తప్పిన ప్రమాదం
క్రైస్ట్‌చర్చ్‌లోని ఆల్‌నూర్ మసీదు వద్దకు మార్చి 15వ తేదీ శుక్రవారం ఇద్దరు దండగులు చేరుకున్నారు. గన్‌తో ఇష్టమొచ్చినట్లు కాల్పులు జరిపారు. ఏమవుతుందో తెలిసేలోపు ప్రార్థన చేస్తున్న చాలామంది రక్తపు మడుగులో పడిపోయారు. మసీదు కాల్పులతో దద్దరిల్లింది. ప్రాణాలు కాపాడుకొనేందుకు చాలామంది పరుగులు తీశారు. తొక్కిసలాట కూడా చోటు చేసుకుందని తెలుస్తోంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అదుపులోకి తీసుకున్న ఒక దుండగుడిని పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: న్యూజిలాండ్ మసీదులో కాల్పులు : 40కి పెరిగిన మృతులు