Tamil Nadu : బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన చర్చి పాస్టర్

చర్చికి వస్తున్న ఇద్దరు బాలికలపై పాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. 

Tamil Nadu : బాలికలపై  లైంగిక వేధింపులకు పాల్పడిన చర్చి పాస్టర్

tamilnadu chruch pastor arrested

Updated On : August 9, 2022 / 5:24 PM IST

Tamil Nadu : చర్చికి వస్తున్న ఇద్దరు బాలికలపై పాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.  రామనాధపురం జిల్లా రామేశ్వరంలోని మండపం   ప్రాంతంలోని  పునితర్ అరుల్ ఆనందర్ చర్చ్ లో   రాబర్ట్ అనే వ్యక్తి పాస్టర్ గా పని చేస్తున్నాడు.

చర్చికి వచ్చే ఇద్దరు బాలికలపై అతను లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో వారు శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.   ఫిర్యాదుపై   గోప్యంగా విచారణ చేపట్టిన శిశు సంక్షేమ శాఖ అధికారులు… రాబర్ట్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాబర్ట్ ను అదుపులోకి తీసుకుని   విచారిస్తున్నారు.  రాబర్ట్ పై పోక్సో చట్టంకింద కేసు నమోదు చేశారు.

Also Read : Whats app new update : మెసేజ్ పంపిన 2 రోజులు తర్వాతా డిలీట్ చేసుకోవచ్చు